Tuesday, December 29, 2015

ఏంటా యాపారం ?

ఏంటీ ఇరీడియం రైస్‌పుల్లింగ్ కాయిన్ ప్రాజెక్టు? ఆ వ్యాపారం మతలబేంటి?  ఒక మహిళ ధైర్యంగా ముందుకొచ్చి చేసిన ఫిర్యాదు వెనక సీరియసేంటి? అందులో ఎమ్మెల్యే కేఏ నాయుడు పాత్రేంటి? వ్యవహారం ఎంతవరకు వెళ్తుంది? ఇప్పుడిదే చర్చ విజయనగరం జిల్లాలో జోరుగా సాగుతోంది. గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడిపై శ్రీకాకుళం ఎస్పీకి ఛాయాకుమారి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఈ జిల్లాలో చర్చనీయాంశమయ్యింది. ఇప్పటికే చెక్‌బౌన్స్ తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై తాజా కేసు ఇరుకున పెట్టేదిలా కనిపిస్తోంది.

విజయనగరం జిల్లాలో చాలా దూకుడుగా వ్యవహరించే ఎమ్మెల్యేగా కె.ఎ.నాయుడిపై ముద్ర ఉంది. అంగన్వాడీ నియామకాలు... విద్యుత్ షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టుల భర్తీలో ఆయనదే పైచేయి. ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాల్లోనూ ఆయన హస్తముందని ఆరోపణలు ఉన్నాయి. దారికి తెచ్చుకునే వ్యూహంలో అధికారుల్ని లక్ష్యంగా చేసుకుని జెడ్పీ సమావేశాల్లో గళమెత్తుతారనే విమర్శలు ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే గతంలో ఆయనపై చెక్‌బౌన్స్ కేసులున్నాయి. కొంతకాలం నుంచి ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయి.

టీడీపీ గ్రూపు రాజకీయాల్లోనూ ఆయనది కీలకపాత్రే. ఇలా...అన్నింటికీ కేంద్రబిందువు అవుతున్న ఆయనపై శ్రీకాకుళం జిల్లాలో ఎస్పీకి ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో ఇందులోనూ ఈయన హస్తముందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎమ్మెల్యే చెప్పినందునే రెండు విడతలుగా  రూ. 10లక్షలు వరకు బ్యాంకు ఖాతాలో వేశానని, ఆయనతో పలు పర్యాయాలు ఫోన్‌లో మాట్లాడానని, అందుకు తగ్గ ఆధారాలు కూడా ఉన్నాయంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొనడంపై ఎంతమేరకు నిజముందో తెలీదుగానీ, విషయం విన్న అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

‘నిక్షేపం’గా దోపిడి

మూడు రాష్ట్రాల కూడలి  కుప్పంలో అక్రమ క్వారీలకు అడ్డు, అదుపూ లేకుండా పోతోంది. ఈ ప్రాంతంలో 150  క్వారీలు నడుస్తున్నాయి. ఇందులో 40లోపు క్వారీ లకు వూత్రమే అనువుతులు ఉన్నారుు. అరకొరగా అనువుతులు ఉన్నవి, అసలు లేనివి కూడా పరిమితికి మించిన విస్తీర్ణంలో తవ్వకాలు చేపడుతున్నారుు. ఒకే పర్మిట్‌తో పదుల సంఖ్యలో లారీలు క్వారీ బ్లాకులను షిప్పు యూర్డులకు తరలిస్తున్నాయి. దీంతో ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయుం దళారుల ఖాతాలకు చేరుతోంది. కుప్పానికి చెందిన టీడీపీ నాయుకుడు జిల్లాలోని  క్వారీల యుజ వూనుల నుంచి గత వుూడు నెలల్లో రూ.100 కోట్లు వసూలు చేసినట్టు సొంత పార్టీ వారే  చెప్పుకున్నారు.

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చిత్తూరు, పలవునేరు, కుప్పం ప్రాం తాల్లో విలువైన రాతి నిక్షేపాలు పుష్కలంగా ఉన్నా యి. గనుల శాఖ పరిధిలో 1200 వందల క్వారీలున్నాయి. ఇందులో 850 క్వారీల్లో తవ్వకాలు సాగుతున్నాయి.  దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు, విదేశాలకు ఇక్కడి రాళ్లు ఎగువుతి అవుతున్నారుు. వీటి వ్యాపారంతోనే కోట్లు గడించిన వ్యాపార వేత్తలు, రాజకీయు నాయుకులు జిల్లాలో అనేక వుంది ఉన్నా రు. ఈ వ్యాపారం లాభసాటిగా ఉండటంతో పొరు గు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వ్యాపారులు ఇక్కడికి వచ్చి కార్యకలాపాలు సాగిస్తున్నారు. రాళ్లతో డాలర్ల పంట పండుతుండటంతో దీనికి సంబంధించిన అన్ని విషయూల్లో భారీగా నగదు చేతులు వూరుతోంది. రాళ్ల వ్యాపారులు ప్రభుత్వాన్ని, అధికార యుంత్రాంగాన్ని శాసిం చేంతగా ఎదిగారు. అయినా ప్రభుత్వ పెద్దలు మాత్రం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

 
క్వారీల్లో పనిచేసే కార్మికుల బతుకులు గాల్లో దీపాలుగా వూరారుు. కనీస సదుపాయూలు, భద్రతా ప్రవూణాలు పాటించే వారు కరువయ్యా రు. రాతి క్వారీల్లో ప్రవూదాలు జరిగి కార్మికులు ప్రాణాలు కోల్పోరుునా, వికలాంగులుగా వూరినా నావువూత్రపు పరిహారంతో క్వారీ నిర్వాహకులు చేతులు దులుపు కొంటున్నారు. స్థానికులను పనిలో పెట్టుకుని ప్రవూదాలు జరిగితే ఇబ్బందు లు ఉంటాయున్న కారణంతో తమిళనాడు, చత్తీస్‌ఘడ్, బిహార్, ఒడిశాల నుంచి కూలీలను రప్పిస్తున్నారు. వారిలో ఒకరితో ఒకరికి పెద్దగా పరిచయూలు కూడా లేకపోవటంతో సహచరులు విగత జీవుతైనా, వికలాంగులైనా మిగతా వారు పట్టించుకోవడం లేదు. కార్మికులకు ఎలాంటి బీవూ, ఈఎస్‌ఐ సదుపాయూలు లేవు.

రాజధాని గ్రామాలు మాయం

రాజధాని కోసం సమీకరించిన భూముల్లో అధికభాగాన్ని రియల్ ఎస్టేట్‌కే వినియోగించనున్నారు. రాజధాని మాస్టర్ ప్రణాళికలో వర్గీకరించిన 20 జోన్లను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమౌతున్నది. ఏ జోన్‌కు ఎన్ని ఎకరాలో ఈ ప్రణాళికలో స్పష్టం చేశారు. దీని ప్రకారం మధ్యతరహా జనసాంద్రత గలిగిన రెసిడెన్షియల్ జోన్‌కు 12,002.5 ఎకరాలను, సాధారణ వాణిజ్య జోన్‌కు 2856.3 ఎకరాలను కేటాయించారు. ఈ రెండు జోన్‌లలోనే  రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఇళ్లు, వాణిజ్య స్థలాలను కేటాయించనున్నట్లు ప్రణాళికలో పేర్కొన్నారు.

అందుకోసం 8వేల ఎకరాలు సరిపోతాయని అంచనా. అంటే మిగిలిన ప్రాంతమంతా రియల్‌ఎస్టేట్ కోసమే వినియోగిస్తారని తెలుస్తోంది. ఈ రెండు జోన్‌లలో... భూములిచ్చిన రైతులకు ఇళ్ల స్థలాలు కేటాయించే చోట దాదాపు 7 వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయనున్నారు. అక్కడ చిన్న, మధ్యతరగతి, ఎగువ తరగతిని ఆకర్షించే అపార్టుమెంట్లను, ఇళ్లను నిర్మించనున్నారు.


కోర్ రాజధాని వచ్చే మూడు గ్రామాలు మాయం కానున్నాయి. ఉద్ధండరాయుని పాలెం, తాళ్లాయపాలెం, లింగాయపాలెం గ్రామాలు కోర్ రాజధానితో కనుమరుగు కానున్నాయి. ఆ గ్రామాలను పూర్తిగా అక్కడి నుంచి తొలగించనున్నారు. అలాగే రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్‌లో భూములిచ్చిన రైతులకు ఆయా గ్రామాల్లో కాకుండా ఆయా గ్రామాల బయట స్థలాలు ఇవ్వాలని మాస్టర్ ప్రణాళికలో స్పష్టం చేశారు. ఉదాహరణకు తుళ్లూరు గ్రామంలో రైతులకు ఇళ్ల స్థలాలు, వాణిజ్య స్థలాలను ఎక్కడ ఇచ్చేది మాస్టర్ ప్రణాళికలో మ్యాప్ ద్వారా వివరించారు. దాని ప్రకారం అది రాజధాని ప్రాంతానికి దూరంగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

Monday, December 28, 2015

మట్టిని కొల్లగొడుతున్నారు

గ్రావెల్ తవ్వకాలు నెల్లూరు జిల్లా కావలి అడ్డాగా మారింది. మొన్న దగదర్తి. నేడు అల్లూరులో అక్రమతవ్వకాలు వెలుగుచూశాయి. కౌరుగుంటలో టీడీపీ నేతలు అక్రమాలు బయటపడటంతో.. విజిలెన్స్ అధికారులు స్పందించారు. వాహనాలను సీజ్ చేసి,  అక్రమ తవ్వకాలకు అట్టుకట్ట వేశారు. తాజాగా అల్లూరు మండలం నార్త్ ఆమలూరులో జరుగుతున్న భారీ అక్రమ తవ్వకాలు బయటపడ్డాయి.

ప్రభుత్వ, ప్రైవేట్ భూములనే తేడా లేకుండా అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వాణిజ్య అవసరాలకు గ్రావెల్ తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గోరంత అనుమతులు అడ్డం పెట్టుకుని వందలాది ఎకరాల్లో భారీ యంత్రాలతో తవ్వకాలు నిర్వహిస్తున్నారు. రాత్రి వేళల్లో అటవీ, రైల్వే స్థలాల్లో కూడా తవ్వకాలు జరుపుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సుమారు ఆరేళ్ల నుంచి ఇక్కడ గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి.

సింగంపేట, బట్రకాగొల్లు మీదుగా నార్త్ ఆమలూరుకు వెళ్లే దారిపొడవునా 20 అడుగుల లోతులో భారీ గోతులు దర్శనమిస్తున్నాయి. రోజుకు 200 నుంచి 300 ట్రిప్పర్లు గ్రావెల్ తరలిస్తున్నట్లు తెలిసింది. కొన్ని సందర్భాల్లో రోజుకు 600 ట్రిప్పర్ల గ్రావెల్ కూడా తరలిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఒక్కో టిప్పర్ కు నాలుగు యూనిట్ల గ్రావెల్ నింపుతున్నారు. ఈ లెక్కన రోజుకు 1200 నుంచి 2400 యూనిట్ల గ్రావెల్ అక్రమంగా తరలిపోతున్నట్లు తెలుస్తోంది. గ్రావెల్ అక్రమ తవ్వకాల వెనుక టీడీపీ నేతల హస్తం ఉండటంతో.. అధికారులు కూడా చూసీచూడనట్లు పోతున్నారు.

ఇద్దరూ అక్కడే.. పాలన ఎక్కడ..?

అమరావతి పరిధిలోకి వచ్చిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పాలన పడకేసింది. కలెక్టర్లు బాబు, కాంతిలాల్ దండేలకు సమర్థ అధికారులుగా గుర్తింపు ఉన్నా.. వారు ఎక్కువగా రాజధాని పనులమీదే దృష్టి పెట్టడం కొత్త సమస్యలకు దారితీస్తోంది. కలెక్టర్ స్వయంగా చూసి సంతకం చేయాల్సిన ఫైళ్లు, అప్రూవళ్లు అన్నీ నిలిచిపోవడంతో ఈ రెండు జిల్లాల్లో జనం లబోదిబోమంటున్నారు.
    కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు ప్రతి సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. దీనికి జిల్లా పరిధిలోని మండల అధికారులంతా తప్పనిసరిగా హాజరుకావాలి పాలనాపరంగా ఇది మంచిదే అయినా ఏకంగా రాత్రి పదకొండు గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ జరపడాన్ని అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు.
   ఇక గుంటూరు జిల్లాలో భూసమస్యలు, వివాదాలు ఎక్కువ. వీటిలో చాలా వరకు పెద్దతలకాయల ఫైళ్లు ఉన్నాయి. కొన్ని ఫైళ్లు ఎమ్మార్వోలు, ఆర్డీవోలు క్లియర్ చేసినా.. కీలక ఫైళ్లు కలెక్టర్ చూడాల్సి ఉంది. అయితే కాంతిలాల్ దండేకు తీరిక లేకపోవడంతో ఫైళ్లన్నీ కలెక్టరేట్లో పేరుకుపోయాయి.

అ.. అమ్మ, ఆ.. ఆకలి

అక్షరాలు రానివారు కూటి కోసం బాథలు పడుతున్న నేటి రోజుల్లో.. అక్షరాలు వచ్చినవారి పరిస్థితి కూడా ఏమంత బాగోలేదు. చిత్తూరు జిల్లాలో సాక్షర భారత్ కార్యక్రమంలో పనిచేస్తున్న విలేజ్, మండల కోఆర్డినేటర్ల పరిస్థితి కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుందన్న సామెతను గుర్తుచేస్తోంది. దాదాపు ఏడాది నుంచి వేతనాలు రాక వీరు ఆకలితో పస్తులుంటున్నారు.
   చిత్తూరు జిల్లాలో సాక్షర భారత్ కింద పదిహేనేళ్లలో నాలుగు లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చారు. సాక్షర భారత్ కింద విలేజ్ కోఆర్డినేటర్లు, మండల కోఆర్డినేటర్లు ఉంటారు. విలేజ్ కోఆర్డినేటర్లకు రెండు వేలు, మండల కోఆర్డినేటర్లకు ఆరువేలు జీతాలు చెల్లిస్తున్నారు. 2014 ఎన్నికల తర్వాత సాక్షర భారత్ కు నిధులు విడుదల కాలేదని అధికారులు చెబుతున్నారు.
    వచ్చేదే బొటాబోటీ జీతాలు, ఇక ఏడాది పైగా జీతమే రాకపోతే తామెలా బతకాలని సాక్షర్ భారత్ కోఆర్డినేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కారు తీరు చూస్తుంటే.. మీ ఇంట్లో తినండి.. మా ఇంట్లో పనిచేయండి అన్నట్లుగా ఉందని వాపోతున్నారు.

మాస్టర్ ప్లాన్ లో రైతులకు చోటేది..?

సింగపూర్ సంస్థలు రూపొందించిన అమరావతి మాస్టర్ ప్లాన్ లో రైతులకు చోటు లేకుండా పోయింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములు త్యాగం చేసిన రైతులను సింగపూర్ తో పాటు ఏపీ సర్కారు కూడా మరిచిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఆర్డీఏ వెబ్ సైట్లో పొందుపరిచిన మాస్టర్ ప్లాన్ లో భూములిచ్చిన రైతులకు ఎక్కడ భూములిస్తారనే విషయంపై స్పష్టత లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాజధాని పరిధిలో తొమ్మిది నగరాలు వస్తాయని, వాటి వివరాలు సవివరంగా ఇచ్చిన ప్రభుత్వం.. రైతులకు అవసరమైన సమాచారం ఇవ్వలేదని మండిపడుతున్నారు. మాస్టర్ ప్లాన్ లో రైతుల భూములకు  చోటు లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూసమీకరణ అయ్యేదాకా రైతులు త్యాగధనులంటూ కీర్తించిన చంద్రబాబు.. ఇప్పుడు  మాస్టర్ ప్లాన్ కు గప్ చుప్ గా ఆమోదముద్ర వేశారని ఆరోపిస్తున్నారు.
రాజధానికి భూములిచ్చిన రైతులకు వరుసగా 125, 500, 1000 గజాల స్థలంలో ప్లాట్లు ఇవ్వాల్సి ఉంది. రైతులకు ప్లాట్లు ఎక్కడ ఇస్తారు, రైతులకు కేటాయించే స్థలంలో ఎన్ని అంతస్తుల భవనాలు నిర్మించుకోవడానికి అనుమతిస్తారనే విషయాల కోసం సీఆర్డీఏ వెబ్ సైట్ చూసిన రైతులకు నిరాశే మిగిలింది. మాస్టర్ ప్లాన్ ఆమోదించాక ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్న ప్రభుత్వం.. రైతులను నట్టేట్లో ముంచే ప్లాన్ లో ఉన్నట్లుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అనంతలో జలగరళం

మినరల్ వాటర్ పేరుతో అనంతపురం జిల్లాలో విక్రయిస్తున్న నీటిపై వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటిలో కరిగిన ఘన పదార్ధాల శాతం చాలా తక్కువగా ఉంటోందని హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలం ఈ నీటిని తాగితే మూత్రపిండాలు, హృదయ సంబంధిత వ్యాధులతో పాటు రక్తపోటు కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. జిల్లాలో పది మినహా మిగతా ప్లాంటులనన్నీ బీఐఎస్ అనుమతి లేకుండా వెలసినవే కావడంతో.. యథేచ్ఛగా ప్రమాణాలు ఉల్లంఘిస్తున్నాయి.

తాగేనీటిలో శరీరానికి అవసరమైన ఘనపదార్ధాలు సరైన మోతాదులో ఉండటం తప్పనిసరి. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ లాంటి ఉపయోగకరమైన పదార్ధాలను మనం నీటిద్వారానే గ్రహిస్తుంటాం. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ నేపథ్యంలో భూగర్భ జలాలు కలుషితమౌతున్నాయి. సీసం, పాదరసం, ఫ్లోరిన్ లాంటి హానికరమైన పదార్థాలు నీటిలో కలుస్తున్నాయి. హానికారకాలను తొలగించే ప్రక్రియలో వాడే ఫిల్టర్లు టీడీఎస్ లను నామమాత్రపు స్థాయికి తగ్గింస్తుండటం కొత్త సమస్యకు దారితీస్తోంది.

పోటీని తట్టుకునేందుకు భూగర్భజలాలను ఎక్కువ మోతాదులో ఫిల్టర్ చేస్తున్నారు. దీంతో మినరల్స్ పూర్తిగా బయటికి వెళ్లిపోతున్నాయి. కొన్ని ప్లాంట్లలో రుచి కోసం రసాయనాలు కలుపుతున్నారు. బీఐఎస్ ప్రమాణాల ప్రకారం ప్రతి ప్లాంటులో ప్రయోగశాల ఉండాలని నిబంధనలు చెబుతున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పబ్లిక్ హెల్త్ అధికారులకు అన్నీ తెలిసినా.. చోద్యం చూస్తున్నారు. 

రొయ్యకు రోగం

 గతనెలలో వచ్చిన వరదలు ఆక్వా రంగానికి తీవ్ర నష్టాలను మిగిల్చాయి. మిగిలిన రొయ్యల సాగును ప్రస్తుతం వ్యాధులు వెంటాడుతున్నాయి. అంతుబట్టని వ్యాధులతో రొయ్య పిల్లలు చనిపోతుండటం, పెరుగుదల లేకపోవటం చూసి ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులు, తల్లి రొయ్యల ద్వారా సోకుతున్న వ్యాధులపై అధికారులు రైతులకు అవగాహన కల్పించడం లేదు. దీంతో రొయ్యకు వచ్చిన రోగం ఒకటైతే.. రైతులు వైరస్ అంటూ రూ. లక్షలు వెచ్చించి తీవ్రంగా నష్టపోతున్నారు.

ఏపీలో నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆక్వా కల్చర్ సాగవుతుంది. అత్యధికంగా వెనామీ నెల్లూరు జిల్లాలోనే ఉంది. సముద్ర తీరాన 54 వేల ఎకరాల్లో రైతులు రొయ్యల సాగు చే పట్టారు. అయితే నవంబర్‌లో కురిసిన భారీవర్షాలకు సుమారు 30 వేల ఎకరాల్లో రొయ్యల గుంతలు వరదలకు కొట్టుకుపోయాయి. పంట చేతికొచ్చే సమయంలో విపత్తు సంభవించ డంతో ఆక్వారైతులు రూ. కోట్లు నష్టపోయారు. వరదలకు ముందు ‘వైట్‌గట్’ వైరస్ కారణంగా కూడా నష్టపోయారు.

రొయ్యకు సోకిన ఎంటిరో సైటోజోన్ హెపిటోప్ పెయినీ (ఈహెచ్‌పీ) వ్యాధి తల్లి రొయ్య నుంచే సోకిందని శాస్త్రవేత్తలు, అధికారులు చెబుతున్నారు. ఆక్వాసాగుకు సంబంధించి గుర్తింపుపొందిన కంపెనీ నుంచే హెచరీలు తల్లిరొయ్యలను కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ కొన్ని హెచరీల వారు స్థానికంగా తక్కువ ధరకు దొరికే తల్లిరొయ్యల వైపు మొగ్గుచూపుతున్నారు. తద్వారా ఏహెచ్‌పీ, ఈహెచ్‌పీ వ్యాధులు సోకుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈహెచ్‌పీ వ్యాధి సోకిన రొయ్యపిల్ల ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోతుంది. అధికారులు కూడా సరిగ్గా సహకరించడం లేదని ఆక్వా రైతులు వాపోతున్నారు. 

Sunday, December 27, 2015

సర్దుబాట్లపై స్పష్టతేదీ?

ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు వ్యవహారం గందరగోళంగా మారింది. పదో తరగతి ప్రీ పబ్లిక్ పరీక్షలు దగ్గరపడుతున్న వేళ ఉపాధ్యాయుల బదిలీలు ఎంతమేరకు సమంజసమనే వాదన వినిపిస్తోంది. సర్దుబాటు బదిలీల అంశంపై పాఠశాల విద్యాశాఖ కార్యదర్శితో ఎమ్మెల్సీలు ఎ.ఎస్.రామకృష్ణ, బచ్చల పుల్లయ్య, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మత్తి కమలాకరరావు మాట్లాడినప్పుడు బదిలీలు ఇప్పట్లో ఉండవని సూచనప్రాయంగా చెప్పారు. ఆచరణలో మాత్రం వేరే విధంగా ఉండడం వివాదాస్పదమవుతోంది.

 సర్దుబాటు బదిలీలకు సంబంధించి కృష్ణా జిల్లాలోని ఆయా మండలాల నుంచి డీఈవో కార్యాలయానికి మిగులుగా ఉన్న ఉపాధ్యాయుల వివరాలు పంపాల్సి ఉంది.  ఎక్కడ అవసరం ఉందో, ఎక్కడ మిగులు ఉన్నారో ఎంఈవోలు, డీవైఈవోల వద్ద వివరాలు ఉన్నప్పటికీ.. ఎమ్మెల్సీలు ఇటీవల చేసిన ప్రకటనతో వాటిని డీఈవో కార్యాలయానికి పంపడం లేదు. అదేమని ప్రశ్నిస్తే.. ‘జరగని బదిలీలకు అంత తొందరెందుకు’ అంటూ సమాధానం ఎదురవుతోందని డీఈవో కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నారు.

 ఉపాధ్యాయుల సర్దుబాటు బదిలీలకు సంబంధించి నివేదికలు విద్యాశాఖ ఉన్నతాధికారులు కోరుతున్నా స్పష్టమైన విధివిధానాలు ఇంతవరకు ప్రకటించలేదు. బదిలీల వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచాలని చెప్పడమే తప్ప మార్గదర్శకాలు ఇంతవరకు ఇవ్వలేదని డీఈవో కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నారు. సర్దుబాటు బదిలీలు కూడా వెబ్ కౌన్సెలింగ్ ద్వారా జరగాల్సిఉంది. అలా జరగాలంటే ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా, ఉద్యోగంలో చేరిన తేదీ, సీనియర్, జూనియర్ టీచర్ల వివరాలు సేకరించాల్సి ఉంది. జిల్లాలో 350 మందికి పైగా ఉపాధ్యాయులు మిగులుగా ఉన్నట్లు డీఈవో కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.

బెజవాడ స్వచ్ఛ ర్యాంకెంతో?

స్వచ్ఛభారత్ మిషన్ సిటీ ర్యాంకింగ్ సర్వేకు రంగం సిద్ధం చేసింది. దేశంలో మొత్తం 75 నగరాలను ఎంపిక చేయగా ఏపీలో విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు కార్పొరేషన్లను ఎంపిక చేశారు. ది క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సర్వే ఏజెన్సీ జనవరి రెండో తేదీ నుంచి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించనుంది. ఈక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు మూడు సర్కిళ్ల పరిధిలో 18 ప్రాంతాలను ఎంపిక చేశారు.

బహిరంగ మల, మూత్ర విసర్జన, వ్యక్తిగత మరుగుదొడ్లు, కమ్యూనిటీ టాయ్‌లెట్స్, బస్టాండ్, రైల్వే స్టేషన్, వాణిజ్య కేంద్రాల్లో టాయ్‌లెట్స్ నిర్మాణం, ఇంటింటి చెత్త సేకరణ, రోడ్లు పరిశుభ్రం చేయడం, శాస్త్రీయ పద్ధతిలో చెత్త తరలింపు, బిహేవియర్ బేస్డ్ కమ్యూనికేషన్, పబ్లిక్ టాయ్‌లెట్స్ పరిశుభ్రత, మురికివాడల అభివృద్ధి, రవాణా అంశాలపై ప్రధానంగా సర్వే చేయనున్నారు. 18002672777 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి అభిప్రాయాలను తెలియజేయవచ్చు.  వచ్చిన ర్యాంకింగ్ ఆధారంగా సుమారు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నగదు ప్రోత్సాహకాలను అందించనున్నారు.

విజయవాడలో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. ఇంటింటి చెత్త సేకరణ 40 శాతానికి మించడం లేదు. 6,500 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం చేయాలని గతంలో అధికారులు నిర్ణయించగా స్థలాభావం కారణంగా 1,150 మాత్రమే నిర్మాణం చేశారు. కమ్యూనిటీ టాయ్‌లెట్స్ నిర్వహణ గాలికి వదిలేశారు. చెన్నై తరహాలో రాఘవయ్య పార్క్‌లో నిర్మాణం చేసిన నమ్మా టాయ్‌లెట్స్ ప్రజలకు అందుబాటులోకి తేవడంలో అధికారులు విఫలమయ్యారు. ఈక్రమంలో నగరం ర్యాంకింగ్‌లో వెనుక బడుతోందనే భయం అధికారుల్ని వెంటాడుతోంది.

కేసులు పెట్టి, ఉద్యోగాలు పీకేయడం సాధికారితా?'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో మహిళా సాధికారిత బూటకమని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం విమర్శించారు. మహిళా ఎమ్మెల్యేలపై కేసులు పెట్టడం, అంగన్ వాడీలను ఉద్యోగాల నుంచి తొలగించడం మహిళా సాధికారితా అని ప్రశ్నించారు.

మహిళలకు ఇసుక్ రీచ్ లు అప్పగించే పేరుతో టీడీపీ నేతలు ఇసుక మాఫియా నడుపుతున్నారని తమ్మినేని సీతారాం విమర్శించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ దోషులు ముమ్మాటికీ టీడీపీ నేతలేనని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న అంగన్ వాడీలకు జీతాలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. 

అంగన్ వాడీలను గతంలో గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు.. ఇప్పుడు వారి ఉద్యోగాలు తొలగిస్తూ.. జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అంగన్ వాడీల ఉసురు తగిలే చంద్రబాబు గతంలో అదికారం కోల్పాయారని, ఈసారి కూడా అదే జరుగుతుందని జోస్యం చెప్పారు.

Friday, December 25, 2015

నాసిరకం చంద్రన్న కానుకలు..!


 
ఏపీ ప్రభుత్వం పేదలకు అందజేస్తున్న క్రిస్‌మస్,సంక్రాంతి కానుకల్లో నాసిరకం సరుకులను అందజేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. పేదలే కదా ఇచ్చింది తీసుకుంటారు,..అదికూడా ఉచితంగానే కదా ఎలాంటి సరుకులు ఇస్తే ఏమిటి అనుకున్నారో ఏమో.పురుగులు పట్టి,పుచ్చిపోయిన కందిపప్పు.నాసిరకమైన బెల్లం అందజేస్తున్నారని లబ్ధిదారులు అవేదన చెందుతు న్నారు. ప్రతి తెల్లరేషన్ కార్డు దారుడికి కేజీ గోధుమపిండి,వంద గ్రాముల నెయ్యి,అరకేజీ బెల్లం,కందిపప్పు, శనగపప్పు,పంచదార అరకేజీ చొప్పున అందజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఈ వస్తువులను వాటి తూకాల ప్రకారం ప్యాకింగ్ చేసి కోట్లు రూపాయలు వెచ్చించి చంద్రబాబు ఫొటోతో ముద్రించిన సంచుల్లో అబ్ధిదారులకు అందజేస్తున్నారు. అయితే ఈ సరుకుల్లో బెల్లం అరకేజీకి బదులు 450 గ్రాములు,వంద గ్రాముల నెయ్యికి 90 గ్రాముల నెయ్యి మాత్రమే వస్తున్నట్లు పలువురు వాపోతున్నారు.అలాగే కందిపప్పులో రాళ్లు, పెంకిపురుగులతో పూర్తిగా నాసిరకం కొట్టొచ్చినట్లు కన్పిస్తోందని చెబుతున్నారు.ఈ సరుకులు అందజేసే సంచులు మాత్రం ఒక్కో డిపోకు కేవలం 50 చొప్పున  అందజేశారు. ఆ సంచుల్లో ఎవరికి ఇవ్వాలో తెలియక డీలర్లు అయోమయంలో ఉన్నారు.

ప్రస్తుతం అదికారులు ముందస్తుగా క్రైస్తవ మతస్తులకు చంద్రన్న సంక్రాంతి కానుకలను క్రిస్‌మస్ పర్వదినానికి అందజేసేందుకు సిద్ధమయ్యారు. కాగా నేటికీ చాలా ప్రాంతాల్లో సరుకుల సరఫరా జరగేదు.మరికొన్ని డిపోల్లో సర్వర్ పనిచేయకపోవడంతో సరుకుల పంపిణీ జరగలేదు.




గొడ్డు చాకిరీకి బహుమానం తొలగింపా..?

రాష్ర్ట ప్రభుత్వం మహిళలు, రైతులు ఉసురు పోసుకుంటోందని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఎంత  మాత్రం మంచిది కాదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అంగన్వాడీల చేత గొడ్డు  చాకిరీ చేయించుకుని వారు పడుతున్న కష్టానికి ఫలితం ఇవ్వలేదు సరికదా ఇప్పుడు వారిని విధుల నుంచి తొలగించడానికి నిర్ణయం తీసుకోవడం నీచమైన చర్యగా అభివర్ణించారు.  ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉందని, వీడియో పుటేజ్‌ల ద్వారా గుర్తించి వారిని విధుల్లోంచి తొలగించడానికి ఉత్తర్వులు ఇవ్వడం దారుణమన్నారు.   అంగన్వాడీలకు మద్దతుగా ఉద్యోగ సంఘాలు నిలవాలని కోరారు.

ఆడవారిని కండతడి పెట్టించారని, వారి ఉసురుతో రాజకీయ పతనం తధ్యమని జోస్యం చెప్పారు.
మరోవైపు  రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి నిబంధనలు పెట్టి ప్రభుత్వం చిత్రహింసలకు గురి చేస్తోందని, అసలు ధాన్యం కొనుగోలు చేయడానికి ఇష్టం లేదా? లేక చెల్లించేందుకు డబ్బులు లేవా? అని బేబీనాయన ప్రశ్నించారు.. ఇన్ని నిబంధనలు మునుపెన్నడూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

పండించిన పంటను తీసుకోకపోవడంతో రైతు కన్నీరు పెడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. కౌలురైతులకు కార్డులుండాలని, ఎకరాకు 25 క్వింటాళ్లే తీసుకురావాలనే నిబందన  పెట్టి వారికి ఇబ్బందులకు గురి చేస్తుండడం అన్నాయమన్నారు.   క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న కష్టాలు, ఇబ్బందుల గురించి పరిశీలన చేయాలన్నారు. నిబంధనలను సడలించి రైతులు స్వేచ్ఛగా అమ్ముకునే విధంగా ఉత్తర్వులను వెంటనే ఇవ్వాలని  డిమాండ్ చేశారు.

చేనేత ప్రదర్శనలో ఆకలి కేకలు

శ్రీకాకుళంలో చేనేత వస్త్రాల విక్రయానికి ఏర్పాటు చేసిన ప్రదర్శనలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన దుకాణదారులకు ఆకలిదప్పులు తప్పలేదు. రెండు దశాబ్దాలుగా ప్రదర్శన నిర్వహణ వ్యయాన్ని చేనేత జౌళిశాఖ పెంచకపోవడంతో అమ్మకందారులకు భోజనం కూడా పెట్టలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకుంటామని వేదికలపై చెప్పడం తప్ప క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు.

చేనేత వస్త్రాలను నేతకార్మికుల నుంచి సొసైటీల ద్వారా సేకరిస్తారు. వాటిని మార్కెట్‌లో విక్రయించి వచ్చిన లాభాలను జీతాలుగా పంచుకోవడం ఎన్నోఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ. ఏడాదికొకసారి ప్రతి జిల్లాలో చేనేత వస్త్రాల విక్రయ ప్రదర్శన తప్పనిసరి. విక్రయ ప్రదర్శనకు చేనేత జౌళిశాఖ జిల్లా శాఖలకు అనుమతిస్తుంది. ఈ అనుమతి మేరకు ప్రదర్శన నిర్వహణకు ఆశాఖ ఉన్నతాధికారులు రూ. 2 లక్షల నిధులు చెల్లిస్తారు.

1994లో నిర్ణయించిన మేరకు ప్రదర్శన పది రోజుల పాటు ఉండాలి. అయితే రెండు దశాబ్దాలు దాటినా నిర్వహణ వ్యయం పెంచకపోవడంతో వచ్చిన అమ్మకందార్లకు భోజనాలు కూడా పెట్టుకోలేని స్థితిలో చేనేత జౌళిశాఖ ఉంది. గతంలో ప్రదర్శనకు 10 రోజులు అవకాశం ఉండేది. నిర్వహణ వ్యయం పెంచని అధికారులు ప్రదర్శనను ఎనిమిది రోజులకు తగ్గించారు. దీంతో అమ్మకాలు అంతంతమాత్రంగానే సాగుతున్నాయని అమ్మకందారులు వాపోతున్నారు.

Thursday, December 24, 2015

క్యాట్ ఫినిష్

 కొల్లేరు కేంద్రంగా నిషిద్ధ క్యాట్‌ఫిష్ మాఫియా చెలరేగిపోతోంది. తెలుగు తమ్ముళ్ల కనుసన్నల్లో యథేచ్ఛగా సాగు చేసేస్తున్నారు. ఈ చేపల్ని తింటే ఒళ్లు గుల్లవడం ఖాయమని తెలిసినప్పటికీ అధికార యంత్రాంగం క్యాట్‌ఫిష్ అక్రమ రవాణాను అడ్డుకోలేకపోతోంది. కొల్లేరు  అభయారణ్యంలో మడుగులు ఏర్పాటుచేసి మరీ ఈ సాగు చేపట్టారు. వీటికి కోళ్ల వ్యర్థాలు, మిగిలిపోయిన అన్నం, కూరలను  మేతగా  వేస్తూ ప్రజారోగ్యంతో ఆటలాడుతున్నారు. ఇలా వ్యర్థాల రవాణా ద్వారా ప్రతి నెలా రూ.150 కోట్ల టర్నోవర్ సాగిస్తున్నారు. సాక్షాత్తూ వైద్య,  ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఇలాకాలోనే ఇంత దారుణం జరుగుతున్నా ఆయన పట్టించుకోకపోవడం గమనార్హం.

  కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని కొల్లేరు పరీవాహక ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం నిషేధించిన క్యాట్‌ఫిష్ సాగు అధికార పార్టీ నేతల అండతో జోరుగా జరుగుతోంది. టీడీపీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, మండల స్థాయి నాయకులు ఈ దందాకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. జిల్లా హద్దుల్లోని కొల్లేరు ప్రాంతం నుంచి రోజూ 10 టన్నుల క్యాట్‌ఫిష్‌ను హైదరాబాద్ తరలిస్తున్నారు. ఇక్కడ కేజీ రూ.30కి కొనుగోలు చేసి అక్కడి మార్కెట్‌లో రూ.130 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. ఏటి చేపలుగా చెప్పి వీటిని ఇతర రాష్ట్రాల్లోని మత్స్యప్రియులకు అంటగడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం 2007లో క్యాట్‌ఫిష్ పెంపకంపై నిషేధం విధించింది. ఆఫ్రికాకు చెందిన ఈ చేప కోడిఈకలు, పేగులు వంటి వ్యర్థాలను మేతగా తింటుంది. ఇవికాక నిల్వఉన్న అన్నం, కూరల్ని కూడా ఆహారంగా తీసుకుంటుంది. వీటన్నింటినీ నిత్యం రవాణా చేసే మాఫియా కృష్ణా  జిల్లాతోపాటు సమీప పశ్చిమగోదావరి  జిల్లాలో ఉంది. ఈ వేస్ట్‌ఫుడ్ మాఫియా నెలకు రూ.150 కోట్ల ఆదాయం పొందుతోంది.  అధికారులు దాడులు చేస్తే అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగుతున్నారు. మనోడే వదిలేయండని సిఫారసు చేయడంతో అధికారులు రెండు, మూడు కేసులకే పరిమితమవుతున్నారు.
 

తొలగింపుపై తిరుగుబాటు

జీతాల పెంపుపై ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ ఈ నెల 18న ధర్నాలో పాల్గొన్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లను తొలగించాలంటూ ఉత్తర్వులు ఇవ్వటంపై ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్  ఆధ్వర్యాన  మౌన నిరసన చేపట్టారు. నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని విజయవాడ లెనిన్ సెంటర్‌లో ప్రదర్శన చేశారు. తమ న్యాయమైన కోర్కెల సాధన కోసం చేస్తున్న ఉద్యమాలను నీరుగార్చేందుకు టీడీపీ సర్కారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉద్యోగాలు తొలగిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతోందన్నారు.

గత ఆరు నెలలుగా వేతనాలు, బిల్లులు సక్రమంగా రాకపోయినా తాము అప్పులు చేసి మరీ సెంటర్లను నిర్వహిస్తున్నామని అంగన్ వాడీలు చెప్పారు. చాలీచాలని వేతనాలతో అవస్థలు పడుతున్న తాము కనీస వేతనాల కోసం శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తే తమపై పోలీసులతో దాడి చేయించటమే కాకుండా ధర్నాలో పాల్గొన్నవారిని ఉద్యోగాలు నుంచి తొలగించటానికి ప్రయత్నించటం ప్రజాస్వామ్య వ్యవస్థకే సిగ్గుచేటన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు, ధర్నాలు ఉద్యమాలు ఎందుకు చేశారని  ప్రశ్నించారు.

అసెంబ్లీలో రాత్రంతా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురించి చర్చించిన టీడీపీ సర్కారు తమ సమస్యల గురించి పట్టించుకోకపోవటంపై ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. అసెంబ్లీలో తమ సమస్యలపై మాట్లాడుతున్న రోజాను సస్పెండ్ చేయటమేకాక నగరంలో టీడీపీ నాయకులు రోజా దిష్టిబొమ్మను దహనం చేయటం వారి నైజాన్ని తెలియజేస్తోందన్నారు.


 

ఇద్దరు కాల్ నాగుల అరెస్ట్

ధనార్జనే ధ్యేయంగా అధిక వడ్డీలకు డబ్బులు తిప్పుతూ బెదిరింపులు, లైంగిక వేధింపులకు  పాల్పడుతున్న ఇద్దరు ‘కాల్‌మనీ’ వ్యాపారులు పోలీసులకు చిక్కారు. వీరిలో ఒకరు టీడీపీ నేత కాగా మరొకరు వ్యాపారి.పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడితో సన్నిహితంగా ఉంటూ, టీడీపీ నాయకుడిగా చలామణి అవుతూ కాల్‌మనీ కేసులు ఎదుర్కొంటున్న గుడివాడ రామకృష్ణను విశాఖ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

నిందితుడి నుంచి 37 చెక్‌లు, 39 ప్రామిసరీ నోట్లు, నాలుగు కత్తులు, ఎల్‌ఐసీ బాండ్లు, కారు, ద్విచక్రవాహనంను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ త్రివిక్రమవర్మ వెల్లడించారు. మంత్రి అయ్యన్నతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు అతడి  నివాసంలో దొరికాయి. పోలీసులు మాత్రం రికార్డుల్లో రామకృష్ణ ఏ పార్టీకీ చెందని వాడిగా పేర్కొంటున్నారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న వాహనానికి ఉన్న టీడీపీ జెండాను కూడా తొలగించారు.

ఉద్యోగులపై బెదిరింపులకు పాల్పడుతున్న ఆరోపణలపై కాల్‌మనీ వ్యాపారి రాంపిళ్ల పాపారావును విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.  నగర పోలీసు కమిషనర్ డి.గౌతమ్ సవాంగ్ కమిషనరేట్‌లో కాల్‌మనీ కేసుల దర్యాప్తునకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశాక తొలి అరెస్టు ఇదే.  

కల్తీ మద్యానికి మరొకరు బలి

కల్తీ మద్యానికి మరొకరు బలయ్యారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా అమరావతి మండలం మండెపూడి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దొండమూడి లింగారావు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు.

అర్ధరాత్రి దాటాక అనారోగ్యానికి గురవడంతో.. కుటుంబ సభ్యులు గుంటూరు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతు బుధవారం మృతిచెందాడు. ఇదే ఆస్పత్రిలో మరో వ్యక్తి కూడా కల్తీ మద్యం బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. విజయవాడ కల్తీమద్యం కేసు విచారణలో ఉండగానే.. ఇలాంటి ఘటనలు జరగడం అధికారుల నిర్లక్యానికి అద్దం పడుతోంది. 

రాజధాని పరిధిలోని స్వల్ప వ్యవధిలో రెండో సంఘటన జరగడం చిన్న విషయం కాదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అసెంబ్లీలో కాల్ మనీపై మాట్లాడితే అమరావతి పరువు పోతుందని మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడీ కల్తీమద్యం వ్యవహారంపై ఏమంటారని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా వాస్తవాలను అర్థం చేసుకుని పరిస్థితులు చక్కదిద్దితే బాగుంటుందని, నేషనల్ గేమ్స్ బిడ్ వేయడంపై పెట్టిన శ్రద్ధ.. శాంతిభద్రతలపై పెట్టాలని చురకలు అంటిస్తున్నారు. 

కాల్‌మనీని పక్కదారి పట్టించేందుకే రోజా సస్పెన్షన్


అసెంబ్లీ సమావేశాల్లో కాల్‌మనీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికే కుట్రపూరితంగా ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. విజయవాడలో వెలుగుచూసిన కాల్‌మనీ వ్యవహారంలో నింధితులందరూ టీడీపీ వాళ్లేనని, వారిపై ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోలేదన్నారు.

శాసనసభలో జరుగుతున్న పరిణామాలు బాధాకరమన్నారు. ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడం సరికాదన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాసం పెట్టడం నరసరావుపేటకు మచ్చగా మిగులుతుందని స్థానిక కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. ముఖ్యమైన బిల్లులు, ప్రజాసమస్యలపై చర్చ జరగాల్సి ఉండగా వాటి గురించి పట్టించుకోకుండా పరస్పరం ఆరోపణలు చేసుకోవడానికే అధికార, ప్రతిపకాలు ప్రాధాన్యత ఇచ్చాయన్నారు. 

రోజాపై సస్పెన్షన్ అన్యాయమని వాదిస్తున్న వైసీపీకి.. కాంగ్రెస్ మద్దతు తోడవంతో.. అధికార పార్టీ ఇరుకున పడ్డట్లు కనిపిస్తోంది. వైసీపీ నేతలే కాకుండా పలు వర్గాల నుంచి రోజా సస్పెన్షన్ పై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. రోజా అభ్యంతరకర భాష వాడిన సీడీ రిలీజ్ చేశాక కూడా.. రోజా ఎవరికో కౌంటర్ ఇస్తున్నట్లుగా ఉందని, రోజా మాటల కంటే ముందు అధికార పార్టీ వైపు నుంచి ఏం మాటలు వచ్చాయో వినిపించకుండా ఎడిట్ చేశారనే వాదన వినిపిస్తోంది.  

Wednesday, December 23, 2015

అంగన్ వాడీల్లో భయం భయం

చాలీచాలని జీతాలతో భారంగా బతుకీడుస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం అంగన్‌వాడీలకు జీతాలు పెంచుతామని ప్రకటించినా ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోలేదు. దీంతో వేతనాల పెంపు జీవోను వెంటనే విడుదల చేయాలనే డిమాండ్‌తో అంగన్‌వాడీలు ఈనెల 18వతేదీన ‘ఛలో విజయవాడ కార్యక్రమం’  నిర్వహించారు.
ఇందుకోసం 13 జిల్లాల నుంచి వేలాదిమంది కార్యకర్తలు తరలి వెళ్లి ప్రభుత్వ తీరును ఎండగట్టారు.  ప్రభుత్వ ఆదేశాలతో రెచ్చిపోయిన పోలీసులు విచక్షణ రహితంగా అంగన్‌వాడీలపై దాడికి దిగారు. దీంతో శాంతియుత ప్రదర్శన కాస్తా.. ఖాకీల క్రౌర్యంతో రక్తసిక్తమైన సంగతి తెలిసింది. ఆ తర్వాత జీతాలను పెంచుతున్నట్లు సీఎం అసెంబ్లీలో ప్రకటించినా జీవో మాత్రం జారీ చేయలేదు. పైగా అంగన్‌వాడీలపై కక్షసాధించే విధంగా.. ఛలో విజయవాడ కార్యక్రమానికి హాజరైన అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులను తొలగించాలని ప్రభుత్వం 21 వతేదీన స్పెషల్ ఆఫీసర్  కేఆర్‌బీహెచ్‌ఎన్ చక్రవర్తి పేరుతో సర్క్యులర్ జారీ చేసింది.

చలో విజయవాడ కార్యక్రమానికి హాజరైన అంగన్‌వాడీలను గుర్తించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఇందులో భాగంగా విజయవాడలో జరిగిన ధర్నా ఫొటోలున్న సీడీలను ప్రాజెక్టు డెరైక్టర్‌కు పంపారు. ప్రాజెక్టు డెరైక్టర్ వాటిని సంబంధిత సీడీపీవోలకు పంపి జిల్లాకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ఏవరైనా ఉన్నారా? అని ఆరా తీస్తున్నారు. ఫొటోలో గుర్తించిన వారిని తొలగించాలని సంబంధిత కలెక్టర్‌ను స్పష్టంగా ఆదేశించారు. ఈ మేరకు ఫొటోల్లో ఉన్న జిల్లా కార్యకర్తలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

 

Tuesday, December 22, 2015

డబ్బు కొట్టు.. ప్లాట్ పట్టు!

గుంటూరు జిల్లా తెనాలిలో అక్రమ వసూళ్ళ పర్వం కొనసాగుతోంది. ప్రతి పనికి ఓ రేటును ఫిక్స్ చేసి కొందరు అధికార పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇప్పటి ఏకంగా పేదలను దోచుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేశారనే వాదన  విన్పిస్తోంది. ఇదే విషయాన్ని కొందరు టీడీపీ నాయకులు  స్వయంగా వెల్లడించడాన్ని బట్టి దందా ఏ స్థాయిలో సాగుతుందో అర్థమౌతుంది.


 తెనాలిలో మొత్తం 40 వార్డులున్నాయి. ఇక్కడ అనేక మంది పేదలు నివశిస్తున్నారు. వీరికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలనే ఉద్ధేశంతో దివంగత వైఎస్ అప్పట్లో భావించారు. అందులో భాగంగా అప్పటి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పెదరావూరు సమీపంలో సుమారు 40 ఎకరాలు సేకరించేందుకు ప్రయత్నించారు. అయితే కొందరు రైతులు దీనిపై కోర్టును ఆశ్రయించగా మరి కొందరు స్వచ్ఛందంగా భూమిని ప్రభుత్వానికి అందజేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆ స్థలంలో అపార్ట్‌మెంట్‌లను ని ర్మించి పేదలకు ఇవ్వాలని భావించారు. ఎంపికైన లబ్ధిదారుడు ప్రభుత్వానికి రూ.50 వేలు చెల్లిస్తే ప్రభుత్వం బ్యాంకర్ల సాయంతో దానిని నిర్మించి పేదలకు అందజేసేందుకు నిర్ణయించారు. ఈ విషయం స్థానిక ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులకు తెలిసింది.

దీంతో కొందరు స్థానిక సంస్థల ప్ర జా ప్రతినిధులు, నాయకులు వసూళ్ళ పర్వానికి తెర తీశారు. లబ్ధిదారుల ఎంపిక జరగాలంటే తమ ఆమోదం లేకుండా కుదరదని పేదలను నమ్మిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఒక్కో పేదవాడి నుంచి రూ.10 వేల నుంచి రూ.25 వేల వర కు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే ఒక్కో దళారి రూ.లక్షల్లో వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

అసలే తక్కువ.. ఆపై ఆలస్యం

ప్రభుత్వ వసతి గృహాల్లో  ట్యూటర్లుగా పని చేస్తున్న నిరుద్యోగులు వేతనాలు అందక పస్తులుండాల్సి వస్తోంది. డీఎస్సీ పరీక్షలు రాసి పోస్టులు రాక ట్యూటర్లుగా మారిన వీరు చాలీచాలని వేతనాలకే విధులు నిర్వహిస్తున్నారు.  అవి కూడా సక్రమంగా రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతలో కీలక పాత్ర పోషించే వీరికి నాలుగు నెలల నుంచి వేతనాలు ఇవ్వక పోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నారుు.

  కృష్ణాజిల్లాలో 40 ప్రత్యేక ఎస్సీ వసతి గృహాలు ఉన్నారుు. వీటిలో సబ్జెక్టుల వారీగా పాఠాలు బోధించే ట్యూటర్లు 160 మంది పనిచేస్తున్నారు. అలాగే 50 ప్రత్యేక బీసీ వసతిగృహాల్లో 176 మంది ఉన్నారు. గుంటూరు జిల్లాలో 45 ఎస్సీ ప్రత్యేక వసతి గృహాలు ఉన్నారుు. వీటిలో 185 మంది ట్యూటర్లు పని చేస్తున్నారు. వీరందరికీ సబ్జెట్‌కు రూ.1500 చొప్పున వేతనం ఇవ్వాల్సి ఉంది. కానీ గుంటూరు జిల్లాలో పని చేసే ట్యూటర్లకు ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల వేతనాలు ఇంత వరకు చెల్లించలేదు. పలు గృహాల్లో వేతనాలు మంజూరైనా ట్యూటర్లకు అందని పరిస్థితి నెలకొంది.

 ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు ఒక వైపు, అందని వేతనాలు మరోవైపు ట్యూటర్లను ఆవేదనకు గురి చేస్తున్నారుు. పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతలో ట్యూటర్ల పాత్ర కీలకమైంది. వసతి గృహాల్లోని విద్యార్థులకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు, రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు విద్యార్థులకు బోధిస్తున్నారు. ఆంగ్లం, లెక్కలు, హిందీ, సైస్స్ బోధిస్తూ విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఇటువంటి ట్యూటర్లకు వేతనాలు చెల్లించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నారుు.

 

 

ఎమ్మెల్యేలు వేలిముద్రగాళ్లా?


టీడీపీ ప్రభుత్వంలో మాటలే తప్ప చేతలు కనిపించడం లేదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శించారు. విశాఖపట్నంలో కొండచరియలు విరిగిపడడం వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాల గురించి ఆయన మంగళవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. తాను తీవ్ర అసంతృప్తితో ఉన్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో  కొండవాలుపై ఉన్న ఇళ్లన్నీ అనధికారిక నిర్మాణాలేనని ఆయన సభ దృష్టికి తెచ్చారు. వాటిని తొలగించి, నివాసితులకు పునరావాసం కల్పించేందుకు  ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాలిక్ కమిటీలో ప్రజాప్రతినిధులకు స్థానం కల్పించకపోవడం సరైంది కాదని ఎత్తిచూపారు.

 ప్రభుత్వం ఏమనుకుంటోంది? ఎమ్మెల్యే లు గతంలోలా వేలిముద్రగాళ్లనుకుంటోం దా? ఎమ్మెల్యేలకూ కొంత బుర్ర ఉందని ప్రభుత్వానికి తెలియదా? కమిటీల్లో అధికారులతోపాటు స్థానిక ఎమ్మెల్యేని కూడా నియమించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? అని విష్ణుకుమార్ రాజు నిలదీశారు

Monday, December 21, 2015

అన్నల దూకుడు

పీఎల్‌జీఏ వారోత్సవాలు ప్రశాంతంగా జరిగాయని ఊపిరిపీల్చుకున్న యంత్రాంగానికి తెరవెనుక మావోయిస్టుల వ్యూహాలు ఆందోళన కలిగించగా తాజాగా నిరసన వారం మొదటిరోజే ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడిని హతమార్చడం సంచలనమైంది. ఈ నెల 21 నుంచి 27 వరకు నిరసన వారం నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన మావోయిస్టులు పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా వ్యవరిస్తున్నాడనే నెపంతో విశాఖ జిల్లా జి.మాడుగుల మండలంలో వంతాల సత్యారావు అనే గిరిజనుడిని గొడ్డళ్లతో అతి కిరాతంగా నరికి చంపారు.
తమకు వ్యతిరేకంగా ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే భయాందోళనలు గిరిజనుల్లో కల్పించే ప్రయత్నం చేశారు. బాక్సైట్ ప్రభావిత అమ్మవారి ధారకొండ, జర్రెల, గాలికొండ, మొండిగడ్డ పంచాయతీల్లో మావోయిస్టులు నాలుగు గ్రూపులుగా విడిపోయి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. వాటిలో కొన్ని గ్రూపులు బాక్సైట్ ఉద్యమాన్ని ఉధృతం చేయడంపై దృష్టి సారించగా, మిగతా గ్రూపులు కాఫీ తోటల ధ్వంసం, వాటిని గిరిజనులకు అప్పగించడం వంటి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ నేపధ్యంలో గ్రామాల్లో తిరుగుతూ గిరిజనుల మద్దతు కూడగడుతున్నారు.

మావోయిస్టు పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు  కిరణ్ అలియాస్ కొండమంచి సువర్ణరాజు తాజా హత్యోదంతంలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అతనితోపాటు 30మంది సాయుధ దళ సభ్యులు గ్రామం నుంచి కొందరు గిరిజనులను వెంటబెట్టుకుని వచ్చి సత్యారావును తీసుకువెళ్లినట్లు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కిరణ్ విజయనగరం, శ్రీకాకుళం జిల్లా కమిటీల్లో పనిచేసి ఐదేళ్ల క్రితం విశాఖలో అడుగుపెట్టాడు. ఇతనిపై అనేక కేసులు ఉన్నాయి. కిరణ్‌ను పట్టిస్తే రూ.5 లక్షల రివార్డ్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందంటే అతను ఎంతటి మోస్ట్‌వాంటెడ్ సభ్యుడో అర్ధం చేసుకోవచ్చు.

ఉద్యోగ భద్రత కోసం గోపాలమిత్రల నిరసన



కనీస వేతనం 13 వేలు  ఏపీ గోపాలమిత్రల సంఘం అధ్యక్షుడు బీ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ గోపాలమిత్రల సంఘం ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలో ధర్నా నిర్వహించారు. తొలుత రైల్వేస్టేషన్ నుంచి లెనిన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ చేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ  చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు గోపాలమిత్రలను నియమించినా ఉద్యోగ భద్రత కల్పించలేదన్నారు. వీరికి ప్రభుత్వం నామమాత్రపు వేతనం చెల్లిస్తోందని తెలిపారు. టార్గెట్లతో జీతంలో కోతలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రైవేటు డెయిరీలతో గోపాలమిత్రల జీవనోపాధి దెబ్బతింటుందని తెలిపారు. పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనుభవజ్ఞులైన గోపాలమిత్రలను వెటర్నరీ అసిస్టెంట్లుగా నియమించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘ గౌరవాధ్యక్షుడు నాగేశ్వరరావు, గోపాలమిత్రల సంఘ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, కౌలు రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి జమలయ్య, వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర కార్యదర్శి క్రాంతి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, గోపాలమిత్రలు పాల్గొన్నారు. 

ఇంద్రకీలాద్రి.. మాటలతో సరి...

ఇబ్బందులెదురైతే ఫిర్యాదు చేయండి వెంటనే పరిష్కరిస్తామన్న ఇంద్రకీలాద్రి అధికారుల మాటలు నీటిపై రాతలుగా మారుతున్నారుు. భక్తులు చేసే ఫిర్యాదులను ఆసరా చేసుకుని కొందరు అక్రమ వసూలుకు తెరతీశారు. అందినకాడికి దండుకుంటూ సమస్యను ఈవో దృష్టికి వెళ్లకుండా చేస్తున్నారు. అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఆలయ ప్రాంగణంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా మా దృష్టికి నిర్భయంగా తీసుకురావచ్చు.. వాటిని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తాం..’ ఇదీ కొన్ని నెలల కిందట గ్రీవెన్‌‌స సెల్ ఏర్పాటు చేస్తూ దుర్గగుడి ఈవో నర్సింగరావు చెప్పిన మాటలు. అయితే ఈ గ్రీవెన్‌‌స సెల్ నిర్వహణ మూణ్ణాళ్ల ముచ్చటగానే మారింది. గ్రీవెన్‌‌స  సెల్ అటకెక్కగా, ఫిర్యాదుల విభాగం అవినీతికి కేంద్రంగా మారింది. తమకు ఎదురైన విభాగాలపై భక్తులిచ్చిన ఫిర్యాదులను  ఆలయ ఈవో దృష్టికి వెళ్లకుండా కొంత మంది సిబ్బంది అడ్డుపడుతూ, ఫిర్యాదులోచ్చిన శాఖ నుంచి అందిన కాడికి దండుకుంటున్నట్లు సమాచారం.

ఫిర్యాదుల పుస్తకంలో తాము ఎదుర్కొన్న సమస్యను, ఫోన్ నంబర్‌ను నమోదు చేస్తుంటారు. అయితే సమస్య పరిష్కారం కాకుండానే ఫిర్యాదుదారుడికి ఫోన్ చేసి అంతా సరి అయిందని చెబుతున్నట్లు తెలుస్తోంది. భక్తుల నుంచి వచ్చే ఫిర్యాదులను రెండు పుస్తకాలలో నమోదు చేయిస్తూ, ఓ పుస్తకం మాత్రమే ఆలయ ఈవో టేబుల్‌పైకి చేరుస్తున్నట్లు తెలిసింది.

Sunday, December 20, 2015

కర్నూలులో వసూల్ రాజాలు

కర్నూలు జిల్లా డోన్ సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు వసూల్ రాజాల అవతారమెత్తారు. ఓబుళాపురం తర్వాత నాణ్యమైన ఖనిజాలకు ఖిల్లా అయిన ఈ ప్రాంతంలో.. మైనింగ్ నిర్వాహకుల నుంచి ముక్కు పిండి డబ్బు వసూలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ జరుగుతున్నా పట్టించుకోకుండా.. కోట్లు వెనకేస్తున్నారు.
          ఈ బాగోతంలో పోలీస్ ఉన్నతాధికారుల హస్తం కూడా ఉండటంతో వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతోంది. ఇటీవలే అధికార పార్టీ పెద్దన్న అండతో ఈ ప్రాంతానికి బదిలీ అయి వచ్చిన.. యువ పోలీస్ అధికారి కూడా మామూళ్లకు తెరతీశారు. మైనింగ్ మామూళ్ల కోసం ఏకంగా ఓ కానిస్టేబుల్, హోంగార్డునే నియమించుకోవడం చర్చనీయంశమైంది.
       హంద్రీనీవా తీర ప్రాంత గ్రామాల్లో నిబంధనలకు విరుద్దంగా ఇసుక తవ్వేస్తున్నా చూసీచూడనట్లు పోతున్నారు. ట్రిప్పులతో సంబంధం లేకుండా ఒక్కో ట్రాక్టర్ కు నెలకు 12వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న మైనింగ్ పైనా అధికారుల కన్ను పడింది. బేతంచెర్ల నుంచి రామళ్లకోట మీదుగా ఎమ్మిగనూరు, ఆదోనికి తరలుతున్న రాయల్టీ లేని ఐరన్ ఓర్ పై కన్నేశారు. నిర్వాహకుల నుంచి మామూళ్లు తీసుకుని ఖజానాకు చిల్లు పడుతున్నా పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ పెద్దన్న అండతో మామూళ్ల దందా మూడు పువ్వులు ఆరుకాయలన్న చందంగా సాగుతోంది.

ఉచితం ఉత్తుత్తినే

ఏపీ సర్కారు ఆర్భాటంగా జారీ చేసిన హెల్త్ కార్డులు నిరుపయోగంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు రూపాయి కట్టకుండా వైద్యసేవలు పొందవచ్చని అధికారులు చెప్పినా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఏకంగా గుంటూరు పెద్దాసుపత్రిలోనే కార్డులు చెల్లవని మొహంమీదే చెప్పేస్తున్నారు. కొంతమంది ఎంపిక చేసిన ఉద్యోగులకు మాత్రమే వైద్యసేవలు అందుతున్నాయి.
      గుంటూరు జిల్లాలో ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి 90 వేల మంది ఉన్నారు. వీరిలో మెజారిటీకి వైద్యసేవలు అందడం లేదు. గుంటూరు పెద్దాసుపత్రిలో వెనక్కి పంపుతుండటంతో.. ప్రైవేటు ఆస్పత్రులు కూడా అదేబాటలో నడుస్తున్నాయి. కార్డులు జారీచేసి ఏఢాది అయినా ఇంతవరకూ వైద్యసేవలు అందకోవడంపై అసంతృప్తి వ్యక్తమౌతోంది.
      అటు ప్రభుత్వ పాలసీలో లోపం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్న వ్యాధులకే ఉచిత వైద్యం అనడం సబబు కాదంటున్నారు. ఉద్యోగుల జీతంలో నెలనెలా కార్డుల కోసం కొంత సొమ్ము మినహాయించుకుంటున్న సర్కారు.. ఆస్పత్రుల్లో వైద్యం అందించకుండా దోబూచులాడుతోందని ఉద్యోగులు మండిపడుతున్నారు.

నీటి వృథా పట్టదా..?

గోదావరి డెల్టాలో రబీ ఆరంభానికి ముందే నీటి కరవు వచ్చిపడింది. ప్రతి చుక్క పొదుపుగా వాడాలని ఇరిగేషన్ శాఖ అధికారులు రైతులకు చెబుతున్నారు. అయితే అన్నదాతలకు ఉచిత సలహాలిస్తున్న అధికారులు బ్యారేజీ నుంచి నీరు లీకౌతున్నా పట్టించుకోవడం లేదు. రబీలో 12 టీఎంసీల నీటి కొరత ఉందని అధికారులు ముందే చెప్పారు. సహజ జలాల రాక తగ్గడంతో కొరత మరింత పెరిగింది.
    ఇటీవలే బ్యారేజీకి ఆధునీకరణ పనులు చేపట్టారు. అయితే పనులు నాసిరకంగా చేయడంతో.. బ్యారేజీ నుంచి రోజూ 200 క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతున్నాయి. అధికారులు తెలిసినా చూసీచూడన్లు వదిలేస్తున్నారు. కేవలం బ్యారేజీ నుంచే కాక.. ప్రధాన పంట కాలువల నుంచి కూడా నీళ్లు లీకౌతున్నాయి. గేట్ల కింద, పక్కన ఉండే రబ్బరు సీలు పోవడంతో.. నీళ్లు వృథా అవుతున్నాయి.
      కాలువల శివారు నుంచి మురుగునీటి కాల్వల వద్ద కూడా మరో 200 క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతున్నాయి. మొత్తం మీద ఈ సీజన్లో రోజుకు 500 క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతున్నా.. అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ఈ సీజన్లో మొత్తం నాలుగు టీఎంసీల నీళ్లు వృథా కాగా.. వీటితో 44 వేల ఎకరాలు పండించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇఫ్పటికైనా కళ్లు తెరచి, అధికారులతో పనులు చేయించాలని వారు కోరుతున్నారు.

వీఆర్‌ఏల సమ్మెకు 50రోజులు!


  కేవలం రెండు డిమాండ్ల సాధన కోసం వీఆర్‌ఏలు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆదివారం నాటికి 50 రోజులు గడిచాయి. విధులకు హజరుకాకుండా, వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసనలు చేపట్టినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలకు తమగోడు చెప్పుకొని వినతులు అందించినా పట్టించుకోలేదు. దీంతో డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె ఆపేది లేదని సంఘ ప్రతినిధులు స్పష్టంచేస్తున్నారు.

సమ్మె కారణంగా తహశీల్దార్ కార్యాలయాల్లో పనులు ఆగిపోతున్నాయి. 2012-14 మధ్య కాలంలో ఏపీపీఎస్సీ నేరుగా గ్రామ రెవెన్యూ సహయకులను నియమించేందుకు రెండు దశల్లో పోటీ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన వారిని వీఆర్‌ఏలుగా నియమించారు. ఇందులో ప్రస్తుత ఏపీలో ఏపీపీఎస్సీ ద్వారా నియమితులైన 4,728 మంది వీఆర్‌ఏలుగా పనిచేస్తున్నారు. వీరు నియమితులైనప్పటి నుంచి గతంలో ఎన్నడూ సమ్మెలోకి వెళ్లలేదు. ప్రస్తుతం వీరంతా ప్రధానంగా రెండు డిమాండ్లతో సమ్మెలోకి వెళ్లారు.

కార్యాలయాల్లో పనిచేస్తున్న రికార్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వ ఉద్యోగుల్లో చివరిస్థానంలో ఉన్నారు. వీరికి అమలవుతున్న పేస్కేలునే తమకు వర్తింపచేయాలన్నది ప్రధాన డిమాండ్.  వీఆర్‌ఏలకు ప్రమోషన్ల శాతం 30 నుంచి 70శాతానికి పెంచాలన్నాది మరో డిమాండ్. ఈ రెండు డిమాండ్లను సాధించుకునేందుకు వీఆర్‌ఏలు నవంబర్ 2న సమ్మె బాట పట్టారు. అప్పటినుంచి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వీరి సమ్మెకు ఆదివారానికి 50రోజులు ముగిశాయి.

విశాఖలో హిల్ కిల్


విశాఖ నగరంలో కొండ లు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. అనధికార కట్టడాలతో ప్రకృతి ప్రసాదిత గిరులను ఆక్రమించుకుంటున్నందుకు ఫలితంగా ప్రాణాలనే బలికోరుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేయడం మినహా శాశ్వత చర్యలు కానరావడం లేదు. నగరంలో 25వేల కుటుంబాలు కొండవాలు ప్రాంతాల్లో జీవిస్తున్నట్టు అంచనా.

 తుపాను, సునామీ, భూకంపం ఇలా ఏ హెచ్చరికలు జారీ అయినా కొండవాలు ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు ఉండడం లేదు.  హూద్‌హూద్ తుఫాను  సమయంలో వేలాది ఇళ్లు నేలకూలాయి. అయినా వేరే ఎక్కడా గూడు దొరకకపోవడంతో మళ్లీ అక్కడే గుడిసెలు, ఇళ్లు నిర్మించుకుని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఎన్నికల సమయంలోనూ, ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ ప్రాంతాల్లో పర్యటించి ప్రత్యామ్నాయ నివాసాలు కల్పిస్తామని, రక్షణ గోడలు నిర్మిస్తామని ఎన్నెన్నో హామీలు గుప్పిస్తున్నా అవేవీ అమలులోకి రావడం లేదు.

విశాఖ నగరానికి ఉపాధి, కూలీ పనులు  కోసం చాలా మంది వలస వస్తుంటారు. కొండవాలు ప్రాంతాల్లో నివసించే వారికి కనీస వసతులు కూడా ఉండవు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు వంటివి అందుబాటులో లేవు. ఇళ్లకు చేరే దారులు కూడా శిథిలమైపోయి ఇబ్బందులు పడుతున్నారు. జీవీఎంసీ తాగునీటిని సరఫరా చేస్తున్నా, అవి పైపులైన్లు ద్వారా కొండపైకి చేరడం లేదు.
 

కాల్‌మనీలో కాసుల వేట

కాల్‌మనీలో కాసుల వేట
‘కాల్‌మనీ’ వ్యవహారం పోలీసు శాఖకు కాసులు పండిస్తోంది. కొందరు ఖాకీలు వడ్డీ వ్యాపారులపై జరుగుతున్న దాడులను సొమ్ము చేసుకుంటున్నారు. ఫైనాన్స్ కార్యాలయాలు, వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో దొరికిన సొత్తును పూర్తిగా బయటపెట్టడం లేదు. అదే విధంగా కొందరు వడ్డీ వ్యాపారులతో తెరచాటు ఒప్పందాలు చేసుకుంటూ వారిని వదిలిపెడుతున్నారు. ఇక అధికార పార్టీకి చెందిన వారిపైన కేసు నమోదు చేయడానికి కూడా నిరాకరిస్తున్నారు. ఇప్పటికే కేసులో ఉంటే వారిని తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
విశాఖ జిల్లా   గాజువాకలో ఓ మాజీ కార్పొరేటర్ బంధువులపై కాల్‌మనీ కేసు నమోదు చేయమని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. కానీ రెండు రోజులైనా వారిపై కేసు నమోదు కాలేదు. ఫిర్యాదు చేసిన వారు, ఆరోపణ ఎదుర్కొంటున్న వారు కూడా స్థానిక ఎమ్మెల్యేకు బంధువులు కావడంతో ఫిర్యాదుదారుడితో సెటిల్‌మెంట్ చేసుకుంటున్నారు. ఈ తతంగమంతా పూర్తయ్యే వరకు కేసు నమోదు చేయకూడదని పోలీసులు మిన్నకుండిపోయారు. నిజానికి కాల్‌మనీ వ్యవహరంలో ఏ కేసు వచ్చినా వెంటనే ఫిర్యాదు స్వీకరించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేస్తున్నారు. కానీ ఈ కేసు విషయంలో మాత్రం అలా చేయకపోవడం చూస్తుంటే అధికార పార్టీ వారికి పోలీసులు ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్నారో అర్ధమవుతోంది.

గుడివాడ రామకృష్ణ అనే వడ్డీ వ్యాపారిపై ఇప్పటివరకు రెండో, మూడు, నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. కేసులు కూడా నమోదయ్యాయి. అతను తన కారుకు టీడీపీ జెండా తగిలించుకుని తిరుగుతుంటే కూడా అతను ఏ పార్టీకీ చెందినవాడు కాడని రికార్డుల్లో చూపిస్తున్నారు. పోలీసుల ఆధీనంలో ఉన్న అతని కారుకు ఉన్న టీడీపీ జెండాను మాయం చేశారు. ఇలా టీడీపీ నేతల బంధువులకు ప్రత్యక్షంగానే పోలీసులు అండగా నిలబడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Saturday, December 19, 2015

బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుంటాం

విశాఖ మన్యంలో బాక్సైట్ ఉద్యమాన్ని అడ్డుకోవడానికి పాలకపక్షం చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను తిప్పి కొడతామని, నిర్బంధాలు, బెదిరింపులకు లొంగేది లేదని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరైన చింతపల్లిలోని బహిరంగసభకు వేలాది మంది గిరిజనులు పెద్ద ఎత్తున తరలివచ్చి బాక్సైట్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వ తీరుకు నిరసనగా గళం విప్పారని అన్నారు. బాక్సైట్ దోపిడీకి అడ్డంగా ఉన్నామనే అక్కసుతో తనపై సంబంధం లేని అభియోగాలు మోపి, తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. 

ఇలాంటి నిర్బంధాలతో బాక్సైట్ ఉద్యమాన్ని అడ్డుకోలేరని హెచ్చరించారు. ప్రాణత్యాగానికైనా సిద్ధపడి ఉద్యమం సాగిస్తున్నామని, గిరిజనుల హక్కులు, చట్టాలను అడ్డుకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించైనా ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం ఉధృతం కావడంతో జీఓ 97ను నిలుపుదల చేస్తామని మంత్రులు నోటిమాటతో సరిపెట్టారని, ప్రభుత్వం దీనిపై ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. ఏడాదికాలంగా బాక్సైట్‌పై సీఎం చంద్రబాబు ఒకమాట, మంత్రులు మరో మాట చెబుతూ గిరిజనులను మోసగిస్తున్నారని విమర్శించారు. 

బాక్సైట్ విషయంలో ప్రభుత్వ వైఖరిపై గిరిజనులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ప్రత్యక్ష పోరుకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని తాను సభలో హెచ్చరిస్తే దాన్ని వక్రీకరించారన్నారు. దీనిపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించి క్రాస్ పిటీషన్ దాఖలు చేస్తే హైకోర్టు తనకు స్టే ఇచ్చిందని తెలిపారు. బాక్సైట్ తవ్వకాలను అడ్డుకోవడానికి తాము చేస్తున్న ధర్మపోరాటంలో విజయం సాధించి తీరుతామని ఈశ్వరి అన్నారు.

టీడీపీ నేతల దారిదోపిడీ

విశాఖ  జిల్లాలో పెద్ద ఎత్తున చేపడుతున్న సీసీ రోడ్లు టీడీపీ ప్రజాప్రతినిధులు.. అధికారులకు కామధేనువుల్లా మా రాయి. ఈ పనుల ద్వారా జే బులు నింపుకోవడమే పని గా పెట్టుకున్నారు. నాకిం త.. నీకింత అంటూ పర్సంటేజీలు వేసుకుని మరీ పంచుకు తింటున్నారు. నాణ్యతను గాలికొదిలేస్తున్నారు.

పంచాయతీలకు కేంద్రం మంజూరు చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులను బలవంతంగా లాక్కొని.. వాటికి ఉపాధి హామీ నిధులను జోడించి జిల్లాలో పెద్దఎత్తున సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం తెలిసిందే. 820 పంచాయతీల పరిధిలో రూ.54 కోట్ల 74 లక్షల 79 వేలతో 1816 పనులు ప్రారంభించారు. పర్సంటేజీలు వేసుకుని మరీ పంచుకు తింటున్నారు. నాణ్యతను గాలికొదిలేస్తున్నారు. 

 పర్సంటేజీల గోల కారణంగా నాణ్యతకు తిలోదకాలిచ్చే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఇటీవల ఉపాధి హామీ, క్వాలిటీ కంట్రోల్ అధికారులు మాకవరపాలెం, అనకాపల్లి, నర్సీపట్నం తదితర మండలాల్లో పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు లోపించినట్టుగా గుర్తించారు. సుమారు 28 రోజుల వాటర్‌ప్యూరింగ్ చేయాల్సి ఉన్నప్పటికీ వారం రోజులు కూడా చేయడం లేదని గుర్తించారు. ఆయా మండలాల ఏఈ, డీఈలపై చర్యలకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది.
 

ఏఈ పై చేయి చేసుకున్న టీడీపీ నేత


ప్రభుత్వ అధికారులపై తెలుగు తమ్ముళ్ల ఆగడాలు రోజు రోజుకు పెచ్చుమీరుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా రేపల్లే పురపాలక సంఘంలో ఏఈగా పని చేస్తున్న శ్రీనివాస్‌పై తెలుగు దేశం పార్టీ నేత, కాంట్రాక్టర్ గోగినేని శ్రీనివాసరావు శుక్రవారం సాయంత్రం దాడికి దిగారు.

బిల్లులకు సంబంధించి విషయంలో ఏఈతో వాగ్వాదానికి దిగిన శ్రీనివాసరావు ఇంటికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న అధికారిని అడ్డుకొని ఆయనపై దాడి చేశాడు. దీంతో కణితి వద్ద గాయం అయింది. ఈ విషయం తెలుసుకున్న అధికార పార్టీ వర్గాలు అక్కడికి చేరుకొని ఇద్దరికి రాజీ కుదుర్చడానికి ప్రయత్నిస్తున్నారు.

గతంలో ఎమ్మార్వో వనజాకిపై టీడీపీ  ఎమ్మెల్యే చేయిచేసుకున్నా.. ఎలాంటి చర్యలు చేపట్టలేదని, అందుకే ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారనే వాదన వినిపిస్తోంది. అధికారం ఉంది కదా అని విర్రవీగితే.. తర్వాత ఎన్నికల్లో ప్రజలే బుద్ధిచెబుతారని ప్రతిపక నేతలు మండిపడుతున్నారు. 

Friday, December 18, 2015

పేదోడికి బిల్లుల షాక్



ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు 100 యూనిట్లలోపు విద్యుత్ బిల్లుల చెల్లింపు నుంచి మినహాయింపు ఇస్తున్నామని గత సర్కారు ప్రకటించింది. దీంతో ఊరట చెందిన పేదలకు.. ఇప్పుడు బకాయిలున్నారని నోటీసులు అందుతున్నాయి. ఎన్నికలకు ముందు ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికపై ఇందిరమ్మ కలలు కార్యక్రమం ద్వారా అధికారులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇప్పుడు టీడీపీ సర్కారు నిధులు ఇవ్వకపోవడంతో.. బకాయిల నోటీసులిస్తూ బెంబేలెత్తిస్తున్నారు.
      ఉపప్రణాళికలో భాగంగా వంద యూనిట్ల లోపు వినియోగదారులకు బిల్లుల చెల్లింపు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ క్రమంలో నెలకు ఓ యూనిట్ అధికంగా వాడినా బిల్లులు కట్టాలని విద్యుత్ అధికారులు నోటీసులిస్తున్నారు. పలువురు వినియోగదారులు గత రెండున్నరేళలో మినహాయింపులు పొందలేకపోగా.. రూ పదివేలు నుంచి ఇరవై వేల రూపాయల బకాయి ఉన్నట్లు వస్తున్న బిల్లులు చూసి ఆందోళన చెందుతున్నారు.
     ఉప్రణాళికలో రాయితీ పోనూ మిగతా బిల్లులను వినియోగదారులు చెల్లించాల్సిందేనని అధికారులు చావుకబురు చల్లగా చెబుతున్నారు. బకాయిలు చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. సర్కారు నిధులు ఇవ్వడం లేదనే మాటను ఎక్కడా చెప్పకుండా అతి జాగ్రత్త పడుతున్నారు. 

అనంతలో మాఫీ మంటలు



రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం మోసం చేయడం, డ్వాక్రా, రైతు రుణాలు చెల్లించాలని బ్యాంకులకు నోటీసులివ్వడంతో.. కలకలం రేగుతోంది. విధిలేని పరిస్థితులు రైతులు, డ్వాక్రామహిళలు అధికవడ్డీలకు అప్పులు తీసుకుని తాత్కాలిక ఉపశమనం పొందారు. అయితే అప్పులు సకాలంలో తీర్చలేక కాల్ మనీ మాఫియా చేతులో తీవ్రక్షోభను అనుభవిస్తున్నారు. కొంతమంది లైంగిక వేధింపులకు కూడా గురయ్యారు.
     అనంతపురం జిల్లా వ్యాప్తంగా 52 వేల డ్వాక్రా సంఘాల్లో.. 5.40 లక్షల మంది సభ్యులున్నారు. వీరు 2014 ఎన్నికల నాటికి 990 కోట్లు బకాయిగా ఉన్నారు. వీటన్నింటినీ మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో ఒక్కో సంఘం నాలుగు నుంచి ఏడు నెలల వరకూ రుణాలు చెల్లించలేదు. అప్పులు చెల్లించాలని బ్యాంకర్లపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో రుణాలు మాఫీ కుదరదని, ఒక్కొక్కరికి పదివేలు అప్పుగా ఇస్తామని సర్కారు చావుకబురు చల్లగా చెప్పింది.
       దీంతో మహిళలు అనివార్యంగా వడ్డీవ్యాపారుల దగ్గర అధిక వడ్డీకి అప్పులు చేశారు. ఇదే అదనుగా కాల్ మనీ మాఫియా చెలరేగిపోయింది. పదివేలు అప్పిచ్చి పదివారాల సమయం ఇచ్చారు. వెయ్యి వడ్డీ అని చెప్పి.. తొమ్మిది వేలే ఇచ్చారు. వారానికి  వెయ్యి రూపాయల చొప్పున చెల్లించాలని మెలిక పెట్టారు. ఈ వడ్డీ భారం మోయలేక మహిళలు బెంబేలెత్తుతున్నారు. జిల్లావ్యాప్తంగా వడ్డీలు కట్టని మహిళలనిు కాల్ మనీ మాఫియా వ్యభిచార కూపంలోకి దించినా.. పోలీసులు మాత్రం పచ్చపార్టీ పెద్దలు బయటికి రాకుండా పావులు కదుపుతున్నారని విమర్శలు వస్తున్నాయి. 

Thursday, December 17, 2015

రెచ్చిపోతున్న కాల్‌యముళ్లు

ప్రభుత్వపరంగా రుణాలు అందకే మహిళలు, రైతులు కాల్‌మనీ వ్యాపారులు బారిన పడుతున్నారని విమర్శలు చెలరేగుతున్నాయి. రెండేళ్ల క్రితం వరకు ప్రతి ఒక్కరికీ డ్వాక్రా రుణాలు అందేవని మహిళలు చెబుతున్నారు. గడిచిన ఎన్నికల్లో చంద్రబాబు డ్వాక్వా, వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇవ్వడంతో రుణాలు చెల్లించలేదు. అయితే చంద్రబాబు మాట నిలబెట్టుకోకుండా మోసగించటంతో మహిళలు రుణాల చెల్లింపుల కోసం కాల్‌మనీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. రైతులదీ ఇదే దీనస్థితి.


కాగా కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులను తప్పించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా పన్నాగాలు పన్నుతోందని మహిళా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.  ఇంట్లో అవసరాలకు అప్పు చేసిన మహిళలపై దారుణంగా వ్యవహరించడం అమానుషమని. అటువంటి వ్యాపారులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. మహిళలను లైంగికంగా వేధించడంతో పాటుగా వారిని వీడియోలు తీయడం వంటివి చేయడం ప్రభుత్వం చేతకానితనం వలనే చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు.     
    
 కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లో సీఎం చంద్రబాబు తొలిముద్దాయిగా, పోలీసులు, వ్యాపారులను రెండు, మూడవ ముద్దాయిలుగా చేర్చాలని డిమాండ్లు వస్తున్నాయి. విజయవాడ పటమటలో జరిగిన ఘటనలో నేరుగా అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొన్న నేపథ్యంలో.. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని కోరుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తప్పించేందుకు రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. బాధ్యులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాల్సిందేనని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.  

Wednesday, December 16, 2015

విజయవాడలో ‘బీపీ’ఎస్!

విజయవాడ  నగరపాలక సంస్థలో బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్  అధికారులు, పాలకులకు బీపీ పెంచుతోంది. ఈ ప్రక్రియ మూడడుగులు ముందుకు.. ఏడడుగులు వెనక్కు చందంగా నడుస్తోంది. స్కీమ్‌కు ఈ నెల 31తో గడువు ముగియనుంది. ఇప్పటివరకు 5,899 దరఖాస్తులు అందాయి.  బీపీఎస్‌కు సుమారు 15 వేల దరఖాస్తులు వస్తే రూ.100 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు, పాలకులు కలలు కన్నారు. తాజా పరిణామాలను పరిశీలిస్తే అందులో మూడో వంతు ఆదాయం కూడా వచ్చేలా కనిపించడం లేదని పెదవి విరుస్తున్నారు.

నగరపాలక సంస్థలు, మునిసిపాల్టీల్లో  భవన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. మే  27 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు.  ఇప్పటికి మూడుసార్లు గడువు పొడిగించారు.  తొలి గడువు ఆగస్ట్ 31 వరకు 4,150 దరఖాస్తులు అందాయి. సెప్టెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు 1,749 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.

ఇప్పటివరకు అందిన బీపీఎస్ దరఖాస్తుల్ని క్లియర్ చేయడంలోనూ టౌన్‌ప్లానింగ్ అధికారులు విఫలమయ్యారు. నవంబర్ 20వ తేదీ నుంచి క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు.  దీనికి సంబంధించి సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశారు. నవంబర్ 16న గుంటూరు, 17న విశాఖపట్నం, 18న అనంతపురం రీజియన్లలో ఎంపికచేసిన  టౌన్‌ప్లానింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఆన్‌లైన్ విధానంలో బీపీఎస్ చేసేందుకు ట్యాబ్‌లు కొనుగోలు చేసుకోవాల్సిందిగా డీటీసీపీ ఆదేశాలు జారీచేశారు.  గ్రేటర్ విశాఖ, గుంటూరు నగరపాలకసంస్థల్లో క్రమబద్ధీకరణ ప్రారంభం కాగా విజయవాడలో అడుగు ముందుకు పడలేదు. ట్యాబ్‌లు కొనుగోలు చేయకపోవడమే ఇందుకు కారణమని  టౌన్‌ప్లానింగ్ ఉద్యోగులు చెబుతున్నారు. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో కొత్తగా దరఖాస్తు చేసేందుకు గృహనిర్మాణదారులు ఆసక్తి  కనబరచడం లేదు.

 

స్కూల్ యూనిఫాం అడ్రస్ ఏదీ?


ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల స్వార్థం విద్యార్థులకు శాపంగా మారింది. పాఠశాల విద్యార్థులకు ఏటా ఇచ్చే యూనిఫాం పంపిణీ మొక్కుబడి తంతే అవుతోంది. పాఠశాలలు తెరచుకుని ఆరు నెలలు పూర్తయినా అవి అందకపోవడంలో వీరి పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. విశాఖ ఐటీడీఏ స్కూళ్లలో చదివే వారిలో పేదలే అధికంగా ఉన్నందున ఒకటి నుంచి 8వ తరగతుల వారికి సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ద్వారా  ఏటా ఉచితంగా రెండు యూనిఫాం ఇస్తోంది.

ఈ సంవత్సరం జిల్లాలో 2,36,218 మంది పిల్లలకు రెండు జతల చొప్పున 4,72,436 యూనిఫాం ఇవ్వాల్సి ఉంది. వాస్తవానికి బడులు తెరిచిన కొద్దిరోజులకే వీటిని పంపిణీ చేయాలి. కానీ అధికార పార్టీకి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు, నాయకులు తమ వారికే కుట్టు పనులు దక్కించుకోవాలని పట్టుపట్టడంతో ఇన్నాళ్లూ యూనిఫాం ప్రక్రియ నిలిచిపోయింది.

  గత ఏడాది ఇలా కొందరు ప్రజాప్రతినిధులు బల్క్‌గా తమ అనుయాయులకు చేజిక్కించుకున్నారు. ఒక్కో జతకు కుట్టుకూలి కింద ప్రభుత్వం రూ.40 చెల్లిస్తుంది. ఇందులో జతకు రూ.5 వరకు కక్కుర్తిపడ్డారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. ఈ సంవత్సరం కూడా అదే తీరులో వ్యవహారం నడపాలని చూశారు. అందుకు ఎన్నో ఎత్తుగడలు వేశారు. చివరకు నవంబర్ 28న సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ రాజకీయాలకు అతీతంగా స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు, హెడ్మాస్టర్లు అభీష్టం మేరకు టైలర్లకు ఇవ్వవచ్చని ఆదేశాలిచ్చారు. దీంతో యూనిఫాంపై కదలిక వచ్చి ఆప్కో వస్త్రాలను ఆయా స్కూళ్లకు పంపడం మొదలెట్టారు. ఇప్పటిదాకా 70 శాతం వస్త్రాల పంపిణీ జరిగింది. మిగిలింది పంపిణీకి కనీసం మరో 15 రోజులైనా పడుతుంది. యూనిఫాం అందజేయకపోవడంతో చాలామంది సివిల్ డ్రెస్‌తో రోజు స్కూలుకు వెళ్లి వస్తున్నారు.

కాల్ మనీ కేసులో తమ్ముళ్లకు వెన్నుదన్ను


 దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌మనీ  ముసుగులో సెక్స్ రాకెట్ దందా నిర్వహిస్తున్న తెలుగు తమ్ముళ్లను కాపాడే చర్యలు మొదలయ్యాయి.  ప్రభుత్వం.. దాడుల పేరిట ఇతర పార్టీలవారిపై పోలీసులను ఉసిగొల్పి హడావుడి చేస్తోంది. సెక్స్ రాకెట్‌లోని నిందితుల పాత్రపై మాత్రం పెదవి విప్పడం లేదు. దందాలో తమ్ముళ్ల పాత్రను కప్పిపుచ్చేందుకే కాల్‌మనీ పేరిట దాడులు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పోలీసుల ద్వారా  ఇతర పార్టీల నేతల పేర్లను వెల్లడిస్తూ సెక్స్ కుంభకోణాన్ని మరుగునపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు.


తమ టీడీపీ నేతల గుట్టు ఎక్కడ రట్టవుతుందోననే భయంతో ప్రభుత్వం కాల్‌మనీ వ్యాపారం పేరిట దాడులకు పోలీసులను వినియోగించింది. రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహిస్తూ ఇతర పార్టీల నేతలను లక్ష్యంగా చేసుకుంది. వారి నుంచి పలు పత్రాలు స్వాధీనం చేసుకుంటూ కాల్‌మనీ వ్యాపారంలో తామే కాదు అన్ని పార్టీలు భాగస్వాములేననే అభిప్రాయం కలిగించే విధంగా చర్యలు చేపట్టింది. అయితే సెక్స్ రాకెట్ వ్యవహారంలో అసలు నిందితులను అరెస్టు చేసేందుకు చర్యలు మాత్రం చేపట్టలేదు.

  కాల్‌మనీ వ్యాపారంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారని చెప్పడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ పార్టీ నేతలపై బాధితులు ఎవరూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయక పోయినా, వారి ఇళ్లను అర్ధరాత్రి తనిఖీ చేసి ఆ కుటుంబాలను  భయభ్రాంతులకు గురిచేశారు. ఆ పార్టీలో కొనసాగితే ఇటువంటి వేధింపులు  ఉంటాయనే రీతిలో ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. వారం రోజుల క్రితం కల్తీ మద్యం కేసు, ఆ తరువాత వెంటనే కాల్‌మనీ మాఫియా వెలుగులోకి రావడంతో టీడీపీ పాలన పట్ల ప్రజల్లో ఏహ్య భావం స్పష్టంగా కనపడుతోంది.
 

నిరసన ఫ్లెక్సీలతో మంత్రికి స్వాగతం



ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రచారం కల్పించేందుకు గ్రామాల్లో జరుగుతున్న జనచైతన్య యాత్రల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులకు వినూత్న రీతిలో నిరసనలు ఎదురవుతున్నాయి. భూసేకరణ నోటిఫికేషన్‌పై గుర్రుమీదున్న పలు గ్రామాల రైతులు ఈ యాత్రల వైపు కన్నెత్తి చూడడం లేదు.

భూసేకరణ నోటిఫికేషన్ నిర్ణయంపై తిరగబడి.. ప్రభుత్వంపై పలుమార్లు పోరాటాలు చేసి కేసుల్లో ఇరుక్కున్న కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలంలోని పొట్లపాలెం గ్రామస్తులు ఇంటింటికీ నిరసన ఫ్లెక్సీలను వేలాడదీసి జనచైతన్య యాత్రలను బహిష్కరించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కాన్వాయ్ మార్గంలో చెట్లకు ఫ్లెక్సీలను వేలాడదీసి గ్రామస్తులు నిరసన స్వాగతం పలికారు.

నిరసనల నుంచి తప్పించుకోవడానికి.. పోర్టు భూసేకరణ నోటిఫికేషన్‌ను త్వరలోనే రద్దు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ పద్ధతిలోనే రైతుల నుంచి భూములు తీసుకుంటామని చెప్పినా.. అనుకున్నంత స్పందన కనిపించలేదు. మొత్తం మీద రైతులంతా ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్న విషయం స్పష్టంగా అర్థమౌతోంది.



అనకాపల్తేలిలో తేలని గానుగాట




విశాఖ జిల్లా తుమ్మపాల చక్కెర కర్మాగార క్రషింగ్‌పై ఇప్పటికే  చక్కెర శాఖ ఉన్నతాధికారులు అనుమతి నిరాకరించడంతో డోలాయమానంలో పడిన కర్మాగార ఎండీ వాస్తవాలను బయటకు చెప్పలేక బంతిని ఎమ్మెల్యే కోర్టులోకి నెట్టివేశారు. ప్రస్తుతం తుమ్మపాల చక్కెర కర్మాగార భవితవ్యం అనకాపల్లి ఎమ్మెల్యే పీలాకు చిక్కుముడిని తెచ్చిపెట్టింది. సాంకేతికంగా ఈ సీజన్‌లో క్రషింగ్‌కు అవకాశాలు ఏమాత్రం లేనప్పటికీ గతంలో ఎమ్మెల్యే పీలా ఇచ్చిన హామీ  మేరకు కడదాకా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి నుంచి కూడా సానుకూల స్పందన రాకపోవడం ఎమ్మెల్యేకు ఇబ్బందులను రెట్టింపు చేసింది.

ఈ ప్రతికూల పరిణాల నేపథ్యంలో అనకాపల్లి నియోజకవర్గ ప్రజల నుంచి ముఖ్యంగా రైతుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోలేక తుమ్మపాల క్రషింగ్ ఎలాగైనా ప్రారంభిస్తామని ఎమ్మెల్యే చెబుతూ ఉంటే చక్కెర శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు తుమ్మపాల కర్మాగార యాజమాన్యం సన్నాహాలపై నీళ్లు చల్లారు.  ఇక్కడ నెలకొన్న నైరాశ్యం వీడాలంటే ఆర్థిక చిక్కుముళ్లు తొలగిపోవాలి. ఈ క్రమంలో తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని ఆప్కాబ్ ఏజీఎం సోమవారం సందర్శించి ఇక్కడి పరిస్థితులపై ఆరా తీశారు.

కర్మాగార ఆర్థిక స్థితిగతుల తోపాటు గోదాముల్లో ఉన్న చక్కెర నిల్వలపై తనిఖీలు జరిపారు. మంగళవారం విశాఖలో ఆప్కాబ్ అధికారులు నిర్వహించనున్న సమావేశంలో తుమ్మపాల అంశంపై చర్చించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే తుమ్మపాల కర్మాగారం అప్పులు ఆప్కాబ్‌కు సైతం చికాకు తెప్పిస్తుంటే కొత్తగా ఎలా అప్పులివ్వాలని ఆప్కాబ్ అధికారులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా  కేబినెట్ సమావేశంలో సహకార చక్కెర కర్మాగారాలపై చర్చకు వచ్చే అవకాశముంది. అదే సమయంలో తుమ్మపాలపై  పూర్తి స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. క్యాబినెట్ లో తేలకపోతే అసెంబ్లీయే శరణ్యమని తెలుస్తోంది. 

సర్కారుపై రేషన్ డీలర్ల సమరం



ప్రజా పంపిణీ వ్యవస్థలో సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం రేషన్ డీలర్ల జీవన భద్రతపై దృష్టిపెట్టటం లేదు. అక్రమాలకు పాల్పడుతున్న డీలర్ల నోటికి ‘ఈ-పోస్’ పేరిట సాంకేతిక చిక్కంతో చెక్ పెట్టి, వారి  ఆదాయం పెంపుదలపై మాత్రం ప్రకటన చేయకుండా తాత్సారం చేస్తోంది. ఫలితంగా చౌకడిపోల నిర్వహణ భారంగా తయారైంది. ప్రభుత్వ తీరుపై విసిగిపోయిన డీలర్ల సంఘం సమరశంఖం పూరించేందుకు సమాయత్తమైంది. తమ కమీషను పెంపు/ వేతనాల నిర్ణయంపై చేసిన విజ్ఞప్తులకు సానుకూల స్పందన రాకుంటే ఈ నెల 21వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని నోటీస్ అందజేసింది.

రేషన్ డీలర్లకు చాలీచాలని కమీషన్లు, పారదర్శకత లేని విధానాలే అక్రమాలకు ఆస్కారం కల్పించాయనేది వాస్తవం. అందులో అధికారుల వాటాలు, సరకుల టెండర్లు, ప్యాకింగ్ వ్యవహారాల్లో ఉన్నతాధికారులు తమ వాటాలు పుచ్చేసుకుంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం.. సబ్సిడీ భారం తగ్గించుకునే ఎత్తుగడల్లో భాగంగా 15 లక్షల బోగస్ రేషన్ కార్డులను ఏరివేసింది. సరకుల పంపిణీకి ఈ-పోస్ యంత్రాలను ప్రవేశపెట్టి గింజగింజకూ లెక్కగడుతోంది.

పెట్టుబడులకు, వస్తున్న కమీషన్‌కు లెక్కచూసుకుంటే చౌక డిపోల నిర్వహణ కష్టసాధ్యమనేది తేలిపోయింది. ప్రతి నెలా రెండు లక్షల టన్నుల బియ్యం, 6,500 టన్నుల చక్కెర, 40 వేల టన్నుల గోధుమలు, 13 వేల టన్నుల కందిపప్పు, 1.5 కోట్ల లీటర్ల కిరోసిన్ చౌకడిపోల్నుంచి సరఫరా చేస్తారు. ఇందుకోసం రాష్ట్రంలోని 29 వేల రేషన్ డీలర్లు పెట్టుబడుల రూపంలో రూ.191.27 కోట్లు డీడీలు తీస్తుంటే, కమీషన్, మిగిలే ఖాళీ గోతాలతో ఆదాయం రూ.10.71 కోట్లు వస్తోంది. మొత్తం 2.59 లక్షల టన్నుల సరకుల అన్‌లోడింగ్ చార్జీలు రూ.1.55 కోట్లు, 29 వేల చౌకడిపోల అద్దె, కరెంటు చార్జీలకు రూ.5.80 కోట్లు, సహాయకుడి జీతం రూ.7.25 కోట్లు కలిపి లెక్కిస్తే రూ.14.60 కోట్లు ఖర్చవుతోంది. కమీషను,గోతాల ఆదాయం రూ.10.71 పోగా, ఇంకా రూ.3.88 కోట్ల వరకూ నష్టం వస్తున్నట్టు డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

‘అంత్యోదయ’కు మంగళం



చిత్తూరు జిల్లాలోని అంత్యోదయ రేషన్ కార్డులకు ప్రభుత్వం మంగళం పాడనుంది. అత్యంత నిరుపేదలు, వికలాంగులు, ఎలాంటి ఆధారంలేని వృద్ధులు, వితంతువులకు ఆసరాగా అంత్యోదయ కార్డులను మంజూరు చేశారు. ఈ కార్డుంటే సభ్యుల సంఖ్యతో పనిలేకుండా ఒక్కో కుటుంబానికి 35 కేజీల చొప్పున బియ్యాన్ని అందజేసేవారు. అయితే ఈ విధానానికి మంగళం పాడుతూ అంత్యోదయ కార్డులన్నింటినీ అధికారులు తెల్లరేషన్ కార్డుల పరిధిలోని తీసుకొస్తున్నారు. లబ్ధిదారుల ప్రమేయం లేకుండానే ఈ వ్యవహారమంతా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు.

 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు, మహిళలను మోసగిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం మరో సంక్షేమ పథకానికి కత్తెర వేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈసారి ఏకంగా అత్యంత పేదలు లబ్ధిదారులుగా ఉండే అంత్యోదయ కార్డులను ఏరివేసే కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలో 9.5 లక్షల కుటుంబాలకు తెలుపు, అంత్యోదయకార్డులు ఉన్నాయి. 89 వేల కుటుంబాలకు అంత్యోదయ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా నెలకు 35 కేజీల బియ్యాన్ని పంపిణీ చేయడం వల్ల నిరుపేదలు, వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు కొంతమేరకు ఆధారంగా ఉండేది. అయితే ప్రభుత్వం చౌకదుకాణాల్లో బియ్యాన్ని అందించేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసింది. ఈ విధానం ద్వారా చౌకదుకాణాల నుంచి ప్రతి నెలా వినియోగదారులు బియ్యాన్ని తెచ్చుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

బయోమెట్రిక్ విధానంలో వినియోగదారుల వేలిముద్రలు సరిపోనట్లు చూపెట్టడం, దీనికితోడు బయోమెట్రిక్ టిన్‌కు నెట్ సమస్యలు చోటుచేసుకున్నాయి. దీని కారణంగా ప్రతినెలా ఇటు వినియోగదారులు, అటు చౌకదుకాణాల డీలర్లు అవస్థలు పడాల్సి వచ్చేది. దీంతో విసుగుచెందిన వినియోగదారులు, డీలర్లు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సమస్య పరిష్కార మార్గంగా  అధికారులు చౌకదుకాణాల్లో అదనంగా ఐరిష్ మిషన్లకు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఐరీష్‌లు కూడా సక్రమంగా పనిచేయక నిరుపయోగంగా మారాయి.

ఖాళీ చేయండి.. కొల్లగొట్టేస్తాం!



విశాఖ ఉక్కు భూములను దక్కించుకునేందుకు అధికార టీడీపీ పెద్దల యత్నాలు చాపకింద నీరులా చకచకా సాగిపోతున్నాయి. వారి నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిళ్లకు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం క్రమంగా లొంగిపోతోంది. నగరంలోని సీతమ్మధారలో 22 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఉక్కు క్వార్టర్లను ఖాళీ చేయాలని ఉద్యోగులకు నోటీసులు జారీ చేయడం ఈ తతంగాన్ని ధ్రువపరుస్తోంది.

స్టీల్‌ప్లాంట్ భూ ములను ప్రభుత్వ పెద్దలకు కట్టబెట్టేందుకు పక్కా స్కెచ్ రెడీ అవుతోంది. దశలవారీగా భూములు కొల్లగొట్టేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు రంగం సిద్ధం చేస్తున్నారు. 20 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యసాధన కోసం రూపొందించిన ప్రణాళికకు తూట్లు పొడుస్తూ స్టీల్‌ప్లాంట్ భూములను లాక్కోవాలని చూస్తున్నారు. స్టీల్‌ప్లాంట్  ఉద్యోగులకు శాటిలైట్ టౌన్‌షిప్ నిర్మాణానికి  రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అనుమతి ఇవ్వడం లేదు. మరోవైపు సీతమ్మధారలోని ప్లాంట్ క్వార్టర్లను ఖాళీ చేయమని యాజమాన్యం తమ సిబ్బందికి నోటీసులు ఇచ్చింది. తాజా పరిణామాలపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.


ఒప్పందం ప్రకారం స్టీల్‌ప్లాంట్ భూముల్లో ఉద్యోగులకు టౌన్‌షిప్ నిర్మించాలి. ఆ మేరకు అగనంపూడిలోని సుమారు 200 ఎకరాల  ప్లాంట్ భూముల్లో టౌన్‌షిప్ నిర్మించాలని ప్రతిపాదించారు. అవి ప్లాంట్ భూములే అయినప్పటికీ టౌన్‌షిప్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం. కానీ సర్కారు పచ్చజెండా ఊపడంలేదు. ప్రభుత్వ ముఖ్యుడి కుటుంబ సభ్యులతోపాటు జిల్లాకు చెందిన ఇద్దరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఆ భూములపై కన్నేయడమే దీని వెనుకనున్న ఆంతర్యం.  సుమారు రూ.వెయ్యి కోట్లు మార్కెట్ ధర ఉన్న ఆ భూములను నామమాత్రపు ధరతో 99 ఏళ్ల లీజుకు తీసుకోవాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగం.

వీధుల్లో టీచర్లు.. గాల్లో చదువులు!



ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టుగా తయారైంది విద్యార్థుల పరిస్థితి. తలాతోకా లేని నిర్ణయాలతో పిల్లల చదువులు గాలికొదిలేయాల్సిన దుస్థితి దాపురించింది. పరీక్షలు ముంచుకొస్తున్న సమయంలో ప్రభుత్వం టీచర్లను జనాభా లెక్కల సేకరణ బాధ్యతలను అప్పగించింది. గతంలో వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయులతో జనాభా లెక్కల సేకరణ  జరిపించేది. దానివల్ల చదువులకు ఆటంకం ఏర్పడేది కాదు. కానీ మునుపెన్నడూ లేనివిధంగా ఈ సారి విద్యా సంవత్సరం మధ్యలో ఆ పనిని అంటగట్టింది.

 దీంతో దాదాపు నెల రోజుల నుంచి సగం మందికి పైగా టీచర్లు జనాభా సేకరణలో పడ్డారు. తొలుత డిసెంబర్ 15 వరకు ఈ బాధ్యతలు నిర్వహించాలని చెప్పింది. కానీ నాలుగో వంతు కూడా ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో తాజాగా ఈ నెలాఖరు వరకు పొడిగించింది. విశాఖ జిల్లాలో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు ఉదయం పూట చదువులు చెప్పడానికి, మధ్యాహ్నం నుంచి జనాభా లెక్కల సేకరణకు వెళ్లేందుకు విద్యాశాఖ అధికారులు అనుమతించారు. పదో తరగతికి బోధించే టీచర్లకు మాత్రం మినహాయింపునిచ్చారు.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టెన్త్ సబ్జక్టులు బోధించే టీచర్లకు జనాభా సేకరణ నుంచి మినహాయింపునిచ్చింది. కానీ జీవీఎంసీ పరిధిలో మాత్రం వీరికి మినహాయింపు ఇవ్వలేదు. దీంతో పలువురు ఎలిమెంటరీతోపాటు ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు జనాభా సేకరణ నిమిత్తం వీధుల్లోకి వెళ్లి ఇంటింటా తిరుగుతున్నారు. దీంతో ముఖ్యంగా పదో తరగతి పిల్లలు నష్టపోయే ప్రమాదంలో పడ్డారు. మూడు నెలలు టీచర్ల బదిలీల ప్రహసనం కొనసాగడంతో అరకొరగానే చదువులు సాగాయి. మళ్లీ ఇప్పుడు జనాభా లెక్కల బెడద వచ్చిపడింది.

కాల్ మనీ కేసులో డాబుసరి దాడులే..!



వందల్లో వ్యాపారులు.. కోట్ల విలువైన ఆస్తుల తాలూకు పత్రాలు.. వేల సంఖ్యలో ఖాళీ ప్రామిసరీ నోట్లు, చెక్కులు.. కాల్‌మనీ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై దాడుల్లో దొరుకుతాయని ఆశించిన పోలీసు పెద్దలకు నిరాశే మిగిలింది. పోలీసు దాడుల్లో ఆశించిన పత్రాలు, వ్యక్తులు పట్టుబడకపోవడంపై  అంతర్మథనం చెందుతున్నారు. గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పరారయ్యారా? లేక దాడుల సమాచారాన్ని అధికారులు లీకు చేశారా? అనే అనుమానాలు పోలీసు అధికారుల్లో వ్యక్తమవుతున్నాయి.

పటమట పంట కాల్వ రోడ్డులోని యలమంచిలి రాము ముఠా కాల్‌మనీ ముసుగులో సెక్స్ దందా నిర్వహించడంపై నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ తీవ్రంగా స్పందించారు. అప్పు ఇచ్చిన ముసుగులో చట్ట వ్యతిరేక దందాకు దిగుతున్న ముఠాల ఆటకట్టించాలని నిర్ణయించుకొని ప్రత్యేక బృందం ద్వారా కాల్‌మనీ వ్యాపారుల సమాచారం సేకరించారు. రాష్ట్రవ్యాప్త దాడుల్లో భాగంగా నగరంలో నిర్వహించిన దాడుల్లో పోలీసు పెద్దలు ఆశించిన మేర ఫలితాలు రాలేదని తెలుస్తోంది. పట్టుబడిన ఆస్తుల విలువ రూ.500 కోట్లు కూడా ఉండదని అధికార వర్గాల సమాచారం. వేలకోట్లలో ఆస్తులు పట్టుబడతాయని భావించిన అధికారులకు ఈ వ్యవహారం మింగుడుపడటం లేదు.


దాడుల విషయం ముందుగానే లీకైనట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి పోలీసు దాడులు ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి ఇంట్లో కనిపించిన కాల్‌మనీ వ్యాపారులు ఉదయానికల్లా ఎలా మాయమయ్యారనేది స్థానికుల ప్రశ్న. ముందస్తు సమాచారం లేకుంటే వెళ్లడం సాధ్యపడదనేది పలువురిలో నెలకొన్న అభిప్రాయం. కొన్ని దాడులు మొక్కుబడిగా జరిగినట్టు చెపుతున్నారు. దొరికిన డాక్యుమెంట్లలో కొన్నింటిని స్వాధీనం చేసుకొని మిగిలినవి వదిలేసి వచ్చారనేది బాధితుల ఆరోపణ.


Monday, December 14, 2015

పోలవరంలోనూ తవ్వుతున్న అక్రమార్కులు



అక్రమార్జనకు, అడ్డగోలు దోపిడీకి అడ్డాగా మారిన నీరు-చెట్టు కార్యక్రమం ముగిసి ఆర్నెల్లు దాటుతున్నా.. అధికార పార్టీ నేతలు మాత్రం తవ్వకాలు ఆఫడం లేదు. చివరికి పోలవరం కుడి కాలువ గట్లను సైతం నిర్భీతిగా తవ్వేస్తున్నారు. పగలు, రాత్రి లేకుండా గ్రావెల తవ్వకాలు సాగుతున్నూ.. నీటిపారుదల శాఖ, రెవిన్యూశాఖ అధికారులు నిద్ర నటిస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కంసాలిగుంట, గొల్లగూడెంలో పోలవరం కుడికాలువ వద్ద గ్రావెల్ గుట్టలను జేసీబీలతో తవ్వి లారీల్లో తరలించేస్తున్నారు. రోజుకు వంద లారీలకు పైనే గ్రావెల్ తరలింపు జరుగుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అడ్డగోలు తవ్వకాల వల్ల గుట్టలు మాయమై ఇప్పుడు కాలువల పక్కన గోతులు దర్శనమిస్తున్నాయి. టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధి సోదరుడి కనుసన్నల్లోనే తవ్వకాలు జరుగుతున్నాయనేది బహిరం రహస్యం.

అయితే మండల స్థాయి అధికారులు తమకేమీ పట్లనట్లు ఊరుకుంటున్నారు. అదేమంటే గ్రావెల్ తవ్వకాలు తమ దృష్టికి రాలేదని బొంకుతున్నారు. మరికొందరు అధికారులు.. అన్నీ తెలిసి ఎందుకు అడుగుతారని తప్పించుకుంటున్నారు. అధికార పార్టీకి ఐదేళ్లు మాత్రమే అధికారమిచ్చారని, యథేచ్ఛగా దోపిడీ చేయమని లైసెన్స్ ఇవ్వలేదని స్థానికులు మండిపడుతున్నారు. 

తూతూ మంత్రంగా పంటనష్టం సర్వే



వర్షాభావంతో పంటల నష్టపోయిన రైతుల్ని.. ఏపీ సర్కారు నట్టేట ముంచుతోంది. పంట నష్టం సర్వేను క్రమపద్ధతిలో నిర్వహించకుండా.. తూతూ మంత్రంగా చేసి చేతులు దులుపుకుంటోంది. పంట నష్టపోయిన రైతుల జాబితాలో కూడా అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీకి అండగా ఉండే కొంతమంది రైతుల పేర్లతో జాబితాలు సిద్ధమయ్యాయి.

జాబితాలు గ్రామసభలో పెట్టి ఆమోదం తీసుకోవాలని నిబంధనలు చెబుతున్నా.. ఆఊసే లేదు. కనీసం పంచాయతీ ఆఫీసుల్లో కూడా జాబితాలు ప్రదర్శించడం లేదు. నిబంధనలకు పూర్తిగా తిలోదకాలిచ్చారు. అధికార పార్టీకి మేలు జరిగే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల సర్వే తప్పులతడకగా ఉందని మండిపడుతున్నారు.

కర్నూలు జిల్లాలో ఆరు లక్షల పైచిలుకు ఎకరాల్లో సాగుచేయాల్సి ఉండగా.. వానల్లేక లక్ష పైచిలుకు ఎఖరాల్లో పంటలే వేయలేదు. సాగుచేసిన భూముల్లో కూడా మూడు లక్షల పైచికులు ఎకరాల్లో పంటనష్టం జరిగింది. మొత్తం మీద జిల్లాకు 600 కోట్ల రూపాయల పరిహారం రావాలని రైతులు చెబుతున్నారు. జిల్లాలోని 53 మండలాలకు.. 40 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించారు. కరవు ప్రాంతాల్లో వేగంగా సర్వే చేయాలన్న ఆదేశాలతో.. అధికారులు కేవలం పదిహేను రోజుల్లోనే సర్వే ముగించేశారు. కేవలం రెండు లక్షల ఎకరాల్లోనే పంట నష్టం జరిగిందని నివేదిక ఇచ్చిన అధికారులు 310 కోట్ల రూపాయలు ఇస్తే చాలని కాకిలెక్కలు కట్టారు. 

కాకినాడ సెజ్ కు నిరసన సెగ



తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సెజ్ పై నిరసన సెగలు రేగుతున్నాయి. తమ అనుమతి లేకుండా సెజ్ ఏర్పాటుచేస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని స్థానిక రైతులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే ఆత్మహత్యలకు కూడా వెనుకాడమని బెదిరిస్తున్నారు. పదేళ్లుగా తమ భూములకు సరైన పరిహారం ఇవ్వలేదని, పునరావాసం సంగతి పట్టించుకోకుండా సెజ్ పనులు ఎలా మొదలుపెడతారని ప్రశ్నించారు. కొత్తపల్లి మండలం రమణక్కపేటలో సెజ్ పనులను అడ్డుకున్నారు.

సెజ్ వ్యతిరేక పోరాట సమితి నేతలతో కలిసి రైతులు, మహిళలు పెద్దసంఖ్యలో భూముల్లో సమావేశమయ్యారు. పోలీసులు వచ్చి రైతులు అక్కడ్నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. అయితే తమ అనుమతి లేకుండా ఎలాంటి పనులు చేయకూడదని. తమ పునరావాసం సంగతి తేల్చాకే.. సెజ్ పనులు చేపట్టాలని రైతులు కరాఖండిగా చెప్పారు. పోలీసులు కొందరు రైతుల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడంతో.. ఉద్రిక్తత నెలకొంది.

సెజ్ కు భూములిచ్చిన రైతులకు.. ఎకరానికి పది లక్షలు చెల్లించాలని, జాబ్ కార్డులు, పింఛన్లు, ప్రస్తుతం పొలాల్లో ఉన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని.. సెజ్ వ్యతిరేక పోరాట సమితి డిమాండ్ చేసింది. రైతులతో కాకుండా దళారులతో సమావేశాలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. ఇప్పటికైనా సెజ్ యాజమాన్యం సానుకూలంగా స్పందించకపోతే.. ఉద్యమాలు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. 

గతుకుల రోడ్లు.. ప్రాణాలు హరీ


చిత్తూరు జిల్లాలో రోడ్లు సామాన్యుడి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. చంద్రగిరి మండలంలోని పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారి ప్రమాదాలకు చిరునామాగా మారింది. తిరుపతికి కూతవేటు దూరంలో ఉన్న చంద్రగిరి మండలం నుంచి వేలాది మంది రోజూ తిరుమల వెళ్తుంటారు. జాతీయ రహదారి గుండా బెంగళూరు, చిత్తూరు, వేలూరు వంటి నగరాలకు నిత్యం వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే మండలంలోని ప్రధాన మలుపు వద్ద నేషనల్ హైవే అధికారులు ఎలాంటి సూచిక బోర్డు ఏర్పాటు చేయలేదు.

కల్ రోడ్డుపల్లి, మంగళి పట్టు, నాగాలమ్మకూడలి, మొరవవల్లి ప్రాంతాల్లో కూడా రోడ్లు గతుకుల మయంగా తయారైంది. రెండు నెలెల క్రితం దీపావళి పండుగ రోజున ఓ కుటుంబం బెంగళూరు నుంచి తిరుమల వస్తుండగా.. ప్రమాదం జరిగి.. భార్యాభర్తలు, కొడుకుతో సహా చనిపోయారు. 2013లో ఇదే రహదారిపై 67 రోడ్డుప్రమాదాలు జరిగాయి. ఇందులో 44 మంది చనిపోగా.. 65 మందికి తీవ్రగాయాలయ్యాయి. 2014లో 71 ప్రమాదాలు జరిగాయి. 39 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 98 మంది గాయాలతో ఆస్పత్రిలో చేరరాు. 2015లో నవంబర్ వరకు 49 ప్రమాదాలు జరగగా.. 39 మంది మరణించారు. 59 మంది క్షతగాత్రులయ్యారు.

 చంద్రగిరి మండలంలోని మామండూరు వద్ద దాబాలు కూడా నిర్వహిస్తున్నారు. దీంతో లారీ డ్రైవర్లు వాహనాలు రోడ్డుమీదే పార్క్ చేస్తుండటంతో.. ప్రమాదాలు మరింత పెరిగిపోతున్నాయి. నేషనల్ హైవే అధికారులు ఇప్పటికైనా స్పందించి మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటుచేయాలని స్థానికులు కోరుతున్నారు. లారీల పార్కింగ్ కూడా నేషనల్ హైవేపై కాకుండా.. లోపలకు పార్క్ చేసేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. 

గురుకులాలకు సవాలక్ష సమస్యలు

ఏపీ గురుకుల పాఠశాలల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ముఖ్యంగా అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న గురుకులాల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా జిల్లాల్లో గురుకులాలు అధ్వాన్న పరిసరాల్లో ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్యానికి తోడు అధికారుల నిర్లక్యం తోడై.. వెనుకబడిన వర్గాల విద్యార్థులు కష్టాలు పడాల్సి వస్తోంది.
ఉదాహరణగా అనంతపురం జిల్లాను పరిశీలిస్తే.. వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలలు ఐదు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు 14, గిరిజన సంక్షేమ గురుకులాలు 4, ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లు నాలుగు, ఏపీఆర్ఐఈ పాఠశాలలు 18 ఉన్నాయి. వీటిలో 14150 మంది విద్యార్థులు చదువుతున్నారు. దాదాపు అన్నింటిలోనూ సమస్యలున్నాయి.

 ప్రభుత్వం పది కోట్లు వెచ్చించి నిర్మించిన కొత్త గురుకులాల్లో కూడా తాగునీటి సమయ్ తీవ్రంగా ఉంది. నీరు ఉప్పగా ఉండటంతో తాగలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ముక్యం కణేకల్లు క్రాస్ వద్ద గురుకులం పరిస్థితి ఘోరంగా ుంది. వృథా నీరు పోయే మార్గం కూడా లేక స్కూల్ పరిసరాలు దుర్గంధం వెలువడుతోంది.  

Friday, December 11, 2015

స్థానిక సంస్థలు అథోగతి

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన స్థానిక సంస్థలు పాలకుల పుణ్యమా అని కునారిల్లుతున్నాయి. కృష్ణా జిల్లాలో మండల పరిషత్ ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు విడుదల చేయకపోవడం, కేంద్రం నుంచి కూడా గ్రాంట్ రాకపోవడంతో.. నిధుల్లేక కొట్టుమిట్టాడుతున్నాయి. ఇటీవల ఆర్థికసంఘం నిధులు రిలీజైన అవి కరెంటు బిల్లు, సిబ్బంది జీతభత్యాలకే సరిపోయినట్లు తెలుస్తోంది.
           రాష్ట్రాలను గుర్తించడం లేదని, తమ వాటా తమకు పంచడం లేదని కేంద్రంపై కొట్లాడే రాష్ట్రాలు.. స్థానికసంస్థలపై మాత్రం శీతకన్నేస్తున్నాయి. నిధులున్నా, లేకపోయినా వాటిని చిన్నచూపు చూస్తున్నాయి. మండల పరిషత్ అభివృద్ధి పనులు చేపట్టే వీలు లేకుండా నిధులు విడుదల చేయకుండా చోద్యం చూస్తున్నాయి. నిధుల్లేనప్పుడు మండల పరిషత్ ఉన్నా.. ఫలితం లేదని ఎంపీడీవోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
         ఇటీవల 13,14 ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు విడుదలయ్యాయి. అయితే ఆ నిధులు సగం కరెంటు బిల్లులకు, మరో 25 శాతం సిబ్బంది జీతభత్యాలకు సరిపోయాయి. మిగిలిన నిధులతో గ్రామాల్లో ఉపాది హామీ పనుల కింద సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. అయితే మండల పరిషత్ కోటా కింద పైసా రాకపోవడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

మిర్చియార్డును కుదిస్తున్న సర్కారు

ఏపీ సర్కారు తన రైతు వ్యతిరేకతను బాహాటంగానే చాటుకుంటోంది. వైఎస్ హయాంలో వంద ఎకరాల్లో మిర్చియార్డుకు ప్రయత్నాలు చేస్తే.. ఇప్పుడు దాన్ని 30 ఎకరాలకు కుదిస్తున్నారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో మిర్చి అధికంగా పండిస్తారు. మిర్చి రైతుల వెసులుబాటు కోసం పెద్ద మిర్చి యార్డు నిర్మించాలని వైఎస్ భావించారు. తర్వాత సీఎం రోశయ్య శంకుస్థాపన చేశారు.
       దుర్గి దగ్గర వంద ఎకరాల్లో యార్డు వస్తుందని అప్పట్లో అధికారులు చెప్పారు. ఇప్పుడు తాజాగా నర్సరావుపేట ఎంపీ రాయపాటి ముప్ఫై ఎకరాల్లో యార్డుకు మళ్లీ శంకుస్థాపన చేయిస్తామని చెప్పడం రైతులు విడ్డూరంగా చెప్పుకుంటున్నారు. అసలు యార్డు ఎన్నిఎకరాల్లో వస్తుందనేది ఎవరూ స్పష్టత ఇవ్వడం లేదు. రైతుల్ని మరోసారి మోసం చేస్తున్నారని విమర్శలువస్తున్నాయి.
        ఓసారి శంకుస్థాపన జరిగిన యార్డుకు.. మళ్లీ శంకుస్థాపన అంటే తిరకాసు వ్యవహారమేనని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. రైతుల విషయంలో మంచి ట్రాక్ రికార్డు లేని చంద్రబాబు యార్డు స్థలాన్ని కుదించరని అనుకోవడానికి వీల్లేదని కొందరు రైతులు భావిస్తున్నారు. ఎంపీ ప్రకటన స్పష్టంగానే ఉందని, ఇంకా వంద ఎకరాలయార్డు వస్తుందనుకోవడం భ్రమేనని అంటున్నారు.

గోదావరి డిెల్టాకు ప్రమాద ఘంటికలు

గోదావరి డెల్టాలో నీటి కరవు లేకుండా చేస్తామని హామీ ఇచ్చిన ఏపీ సర్కారు మాటలు.. నీటిమూటలేనని తేలబోతోంది. గోదావరి డెల్టాలో రబీ పంటకు నీరివ్వడం కష్టమేనని ఏపీ జెన్ కో అధికారులు తేల్చిచెబుతున్నారు. సర్కారు చెప్పినట్లుగా నీళ్లిస్తే మూడు విద్యుత్ కేంద్రాలు మూతపడతాయని, అప్పుడు రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
        రాష్ట్రానికి అన్నపూర్ణగా పేరొందిన గోదావరి డెల్టాలో లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. ఖరీఫ్ పంటకు బాగానే నీరిచ్చిన అధికారులు.. రబీ వచ్చేసరికి చేతులెత్తేస్తున్నారు. మొత్తం మీద 87 టీఎంసీల నీరు అవసరం కాగా.. ప్రస్తుతం అందులో సగమే అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు.
          గతంలో ఒడిషాకు విద్యుత్ ఇచ్చి సీలేరు నుంచి నీరు తీసుకొస్తామని చెప్పినా ఆ మాటలు ఆచరణ సాధ్యంగా కనిపించడం లేదు. గతంలో అధికారులు 75 టీఎంసీల నీరు సేకరించవచ్చని లెక్కలు కట్టారు. అదనపు 12 టీఎంసీల నీరు ఒడిషా నుంచి తీసుకుని విద్యుత్ ఇవ్వచ్చని అనుకున్నారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే.. అధికారుల లెక్క పూర్తిగా తప్పింది. అసలు 75 టీఎంసీలే లేనప్పుడు.. ఇక అదనపు మాటేంటని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Thursday, December 10, 2015

విషజ్వరాలకు జనం విలవిల

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జనం విషజ్వరాలతో బెంబేలెత్తుతున్నారు. నవంబర్ లో వరదలకు కొట్టుకుపోయిన దోమ లార్వాలు.. వరదలు తగ్గగానే మళ్లీ కుంటల్లోకి చేరుకున్నాయి. దోమల దండయాత్ర పెరగడంతో డెంగీ, మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. రోగాలకు తోడు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం జనాన్ని పీల్చి పిప్పిచేస్తోంది.
      నెల్లూరు జిల్లాలో లెక్కకు మిక్కిలిగా ఆస్పత్రులున్నా.. అజమాయిషీ చేసే వారే కరువయ్యారు. కనీసం రోగులకు కనీస వైద్యం అందించడంలో కూడా విఫలమౌతున్నారు. ప్లేట్ లెట్ కిట్లకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని తప్పుడు రిపోర్టులు సృష్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఏకంగా గవర్నమెంట్ టీచర్ కే ప్లేట్ లెట్లు పడిపోయాయని తప్పుడు రిపోర్డులు ఇచ్చిన డాక్టర్లు.. కిట్లు ఎక్కువకు అమ్ముకుంటున్నారని ఆరోపణలున్నాయి.
      ఇంత జరుగుతున్నా జిల్లా వైద్యశాఖ మాత్రం చోద్యం చూస్తోంది. అధికారులు సర్వేలు, సమీక్షలతో సరిపెడుతూ ఆస్పత్రుల తనిఖీల సంగతి గాలికొదిలేశారు. ఆసలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎంతమంది విషజ్వరాలతో అడ్మిట్ అయ్యారు. ఎంత మందికి సరైన చికిత్స అందింది అనే గణాంకాలు కూడా లేకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అధికారులు మేల్కోకపోతే జిల్లాలో విషజ్వరాలు విస్తరించడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సర్పంచ్ లపై సర్కారు పెత్తనం

ఏపీలో సర్పంచ్ లపై సర్కారు పెత్తనం పెరిగిపోతోంది. జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో పనులన్నీ సర్పంచ్ ను పర్యవేక్షించనీయకుండా చేస్తోంది. ఇప్పుడు చెక్ పవర్ కూడా సర్పంచ్ కు లేకుండా పంచాయతీరాజ్ శాఖ అధికారులకు కట్టబెట్టడం వివాదాస్పదమైంది. రాజ్యాంగం ద్వారా స్థానిక సంస్థలకు సంక్రమించిన అధికారాలను ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది.
        14వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు నేరుగా నిధులు మంజూరు చేసింది. ఆర్థిక సంఘం నిధులకు, ఉపాధి హామీ నిధులు కలిపి గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. ఇంతవరకూ బాగానే ఉన్నా రోడ్ల కోసం ఖర్చు చేయాల్సిన నిధులను పంచాయతీ రాజ్ శాఖ అధికారుల ఖాతాకు మళ్లించడం, వారికే చెక్ పవర్ కట్టబెట్టడంపై సర్పంచ్ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
      సర్కారు ఇప్పటికే జన్మభూమి కమిటీల పేరుతో తమ నెత్తిన పరోక్ష శక్తులను కూర్చోబెట్టిందని, ఇప్పుడు ఉన్న చెక్ పవర్ కూడా తీసేస్తే.. ఇక సర్పంచ్ కు విలువేం ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. సర్కారు వైఖరి మార్చుకోకపోతే మూకుమ్మడి రాజీనామాలకు వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు.

రైతులతో సర్కారు దొంగాట

కడప జిల్లాలో రైతులతో ఏపీ సర్కారు చెలగాటం ఆడుతోంది. పంటల బీమా గడువు ముగిసే దశలో కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చి చోద్యం చూస్తోంది. కొత్త నిబంధనలపై రైతులతో పాటు బ్యాంకులకు కూడా సమాచారం లేకపోవడం మరీ విడ్డూరంగా ఉంది. ప్రభుత్వం కావాలనే ఇలాంటి పనులు చేస్తోందని రైతులు మండిపడుతున్నారు.
       జిల్లాలో బుడ్డశనగ, వరి, జొన్న, వేరుశనగ పంటలకు పంటల బీమా ప్రీమియం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం , బీమా కంపెనీలు నోటిఫికేషన్ ఇచ్చాయి. ప్రీమియం డీడీల ద్వారా పంపాలని కోరాయి. పదిహేనో తేదీ తుది గడువుగా పేర్కొనడంతో.. ఇప్పటికే చాలా మంది రైతులు ప్రీమియం కట్టేశారు. తాజాగా రైతు ఖాతాల ద్వారా ప్రీమియం చెల్లించాలనడం వివాదాస్పదమైంది.
      బుడ్డశనగ రైతులు మాత్రం రైతు ఖాతా ద్వారా ప్రీమియం చెల్లించాలని వ్యవసాయ శాఖ అధికారులు ఆలస్యంగా నోటిఫికేషన్ ఇచ్చింది. హడావిడిగా బ్యాంకులకు నోటీసులు పంపింది. మరోవైపు ఇప్పటికే ప్రీమియం కట్టిన రైతులు అయోమయంలో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. తమకెలాంటి ఆదేశాలు రాలేదని వారు చెబుతున్నారు. రైతుల గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

Tuesday, December 8, 2015

మామూళ్ల మత్తులో కల్తీ గాలికి..

విజయవాడలో కల్తీ మద్యం ఐదుగురి ప్రాణాలను బలిగొన్న నేపథ్యంలో.. ఎక్సైజ్ అధికారులు తనిఖీల పేరుతో ఇప్పుడు హడావిడి చేస్తున్నారు. నిజానికి ఎక్కడ కల్తీ మద్యం అమ్ముతున్నారో, ఎలా కల్తీ చేస్తున్నారో పోలీస్, ఎక్సైజ్ అధికారులు అందరికీ తెలుసు. అయితే ప్రతి నెలా ఐదో తేదీ నాటికి రెండు శాఖలకు మామూళ్ల కవర్లు వెళ్లిపోవడంతో.. నిమ్మకునీరెత్తినట్లుగా ఉంటున్నారు.
        ఏపీ తాత్కాలిక రాజధానిలో అనుమతి లేని బార్లు, వైన్ షాపులకు లెక్కేలేదు. అనుమతి ఉన్న వాటిలో కూడా నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు సాగుతుంటాయి. ముఖ్యంగా మూడు సిండికేట్లు ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అధికార పార్టీ నేతల బార్ల జోలికి అస్సలు వెళ్లని పోలీసులు.. ఇతర బార్ల నుంచి మామూళ్లు తీసుకుని గమ్మునుంటున్నారు.
      చాలా బార్లలో మందుబాబులకు మత్తెక్కగానే.. చీప్ లిక్కర్ పోసేసి ఖరీదైన మద్యమే పోశామని నమ్మిస్తున్నారు. మరికొన్నిచోట్ల మత్తు కోసం మంచినీళ్లలో మిథైల్ ఆల్కహాల్ కలుపుతున్నారు. ఇక మరికొంతమంది అతితెలివి ప్రదర్శిస్తూ ఒడిషా, జార్ఖండ్ నుంచి నాన్ డ్యూటీ మద్యం తెచ్చి.. లూజులో విక్రయిస్తున్నారు. దుర్ఘటన జరిగినప్పుడు హడావిడి చేసే అధికారులు.. సాధారణంగా మత్తులో జోగుతూ ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడుతున్నారు.

యూజర్ బాదుడుకు రంగం సిద్ధం

ఏపీలో మరో బాదుడుకు రంగం సిద్ధమైంది. రిజిస్ట్రేషన్ యూజర్ ఛార్జీలు పెంచాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రెండుసార్లు రెవిన్యూ స్టాంపు డ్యూటీ పెంచిన సర్కారు.. మళ్లీ యూజర్ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో కక్షిదారులపై భారీగా భారం పడనుంది. ప్రజల జేబులు చిల్లు చేస్తూ వసూలు చేస్తున్న యూజర్ ఛార్జీలు రెవిన్యూ శాఖకు చేరట్లేదని విమర్శలున్నాయి.
            యూజర్ ఛార్జీలను భారీగా పెంచిన సర్కారు.. ఎక్కువ ఆదాయం వస్తుందని ఆశిస్తోంది. పవర్ ఆఫ్ అటార్నీ యూజర్ ఛార్జీ యాభై రూపాయల నుంచి వందకు పెంచారు. లీజు, తనఖా, ఒప్పందాల రిజిస్ట్రేషన్ కోసం యూజర్ ఛార్జీ 20 రూపాయల నుంచి 100 రూపాయలకు పెంచారు. సొసైటీ బైలా సర్టిఫికేషన్ కు ప్రస్తుతం 35 రూపాయలు వసూలు చేస్తుండగా.. అది కూడా 100 రూపాయలకు పెంచారు.
            ఓవైపు సామాన్యుల ముక్కుపిండి యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్న సర్కారు. రెవిన్యూ శాఖకు మౌలిక సదుపాయాల విషయంలో శీతకన్నేస్తోంది. చాలావరకు రిజిస్ట్రేషన్ల కార్యాలయాలు పాత భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కనీసం విద్యుత్, ఫోన్ బిల్లులకు కూడా సర్కారు డబ్బులివ్వకపోతే ఆయా సబ్ రిజిస్ట్రార్లే భరిస్తున్నారని రెవిన్యూ వర్గాలు చెబుతున్నాయి.
 

విన్నపాలు పట్టని పచ్చ చొక్కాలు

ఏపీలో సంక్షేమ రాజ్యం తెస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. సీఎం అయ్యాక పేదలను గాలికొదిలేశారు. జన్మభూమి కమిటీలకు వేల సంఖ్యలో రేషన్ కార్డులు, తెల్లకార్డుల కోసం దరఖాస్తులు వచ్చినా వాటిని పట్టించుకున్న పాపాన పోవడం లేదు. తెలుగు తమ్ముళ్లు సొంత పనులు చేసుకుంటూ. పేదలను నిర్లక్ష్యం చేస్తున్నారు.
           రేషన్ కార్డులు అందక దారిద్ర్య్రేఖకు దిగువన ఉన్నవారి పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. వికలాంగులు మరీ ఇబ్బంది పడుతున్నారు.. అసలే కరువు, వరదలతో పంటలు నష్టపోయిన రైతులు, వారిపై ఆధారపడే రైతుకూలీల పరిస్థితి దుర్భరంగా ఉంది. వీరి కష్టాలకు రేషన్ కష్టాలు తోడవడంతో బతడకడమే కష్టంగా ఉందని వాపోతున్నారు.
            అమరావతి పేరుతో త్రీడీ సినిమా చూపిస్తున్న చంద్రబాబు.. వాస్తవంలోకి వచ్చి ప్రజల్ని ఆదుకోవాలని జనం కోరుతున్నారు. ఏపీలో జనం ఆకలికి తాళలేక చచ్చిపోతుంటే.. మంత్రులు మాత్రం అంతా బాగుందని చెప్పుకోవడం సిగ్గుచేటు అంటున్నారు. ప్రభుత్వం భ్రమలు వదిలేసి వాస్తవంలో బతకాలని కోరుతున్నారు. 

Friday, December 4, 2015

గౌరవ వేతనం గుటకాయ స్వాహా

గ్రామీణ ఆరోగ్యానికి చుక్కానిగా నిలిచే ఆశా కర్యకర్తలకు ప్రభుత్వం మొండిచేయి చూపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో ఆశా కార్యాకర్తలకు ఏడేళ్లుగా ఓ క్వార్టర్ గౌరవ వేతనం ఎగ్గొడుతున్నారు. ఆశా కార్యకర్తలకు ఇచ్చేదే నాలుగు వందల రూపాయల జీతం.. అందులో కూడా కొట్టేస్తున్నారని, వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
           2007 నుంచి ఈ తంతు కొనసాగుతోంది. జిల్లాలోని 16 ప్రాథమికఆరోగ్య కేంద్రాల పరిధిలో మొత్తం 605 మంది ఆశా కార్యకర్తలున్నారు. వీరికి ఇప్పటివరకు 57 లక్షల రూపాయల బకాయిలు ఇవ్వాల్సి ఉంది. ఎప్పటికప్పుడు మాయమాటలు చెబుతున్న అధికారులు తమ డబ్బులు ఇవ్వడం లేదని ఆశాలు ఆరోపిస్తున్నారు.
    గ్రామాల్లో ఆశాలే ప్రభుత్వ డాక్టర్లు, నర్సులకు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నారు. ఎన్నో అంటురోగాలు ప్రబలకుండా జాగ్రత్తుల తీసుకుంటారు. గర్భిణులు, బాలింతలను కంటికి రెప్పలా చూసుకుంటారు. ఆశాలకు జీతాలు పెంచకపోతే ఉన్న వేతనం ఎగ్గొట్టడమేమిటని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి

చిత్తూరులో ఉపకారానికి మంగళం

చిత్తూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా రెవిన్యూ కార్యాలయాలు పనిచేయడం లేదు. మామూలగానే ధృవీకరణపత్రాల కోసం నెలల తరబడి తిప్పుకునే అధికారులు.. ఇప్పుడు వర్షాల సాకుతో అసలుకే ఎసరు తెస్తున్నారు. అధికారుల అలసత్వం కారణంగా ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్పులకు అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది.
         జిల్లాలో స్కాలర్ షిప్పులకు అర్హులైన విద్యార్థులు 80 వేల మంది ఉన్నారు. వీరిలో దాదాపు 25 వేల మంది వరకు ఇంతవరకూ దరఖాస్తులు కూడా చేసుకోలేదు. వీరు విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ధృవీకరణ పత్రాల కోసం తిరుగుతున్నా ఇంతవరకూ చేతికి రాలేదు. వీరికి స్కాలర్ షిప్పులు వచ్చే సూచనలు కనిపించడం లేదు.
        స్కాలర్ షిప్పుల కోసం ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించిన సర్కారు ఇప్పుడు మరోసారి పొడిగించేందుకు సిద్ధంగా లేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

లెక్క తప్పితే చిక్కులే

అనంతపురంలో టీడీపీ ప్రజాప్రతినిధి చెలరేగిపోతున్నారు. ప్రైవేట్ కంపెనీల నుంచి మామూళ్లు వసూలు చేయడంలో ఆరితేరిపోయారు. ఎవరైనా ఆయన చెప్పినట్లు డబ్బులు ఇవ్వకపోతే.. ప్రాజెక్టులు నిలిపివేసేందుకు కూడా వెనుకాడటం లేదు. ఈ ప్రజాప్రతినిధి యవ్వారం తట్టుకోలేక రెండు కంపెనీలు అనంతపురం నుంచి బిచాణా ఎత్తేశాయి. ధర్మవరం నియోజకవర్గం ఈయన వల్లే అభివృద్ధి చెందడం లేదని స్థానికులు భావిస్తున్నారు.
              చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పచ్చచొక్కాలకు రెక్కలు వచ్చాయి. ఇష్టారాజ్యంగా మామూళ్లు సాగిస్తూ.. అన్నివర్గాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కరువు జిల్లాగా పేరుబడ్డ అనంతపురంలో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటుచేస్తే యువతకు ఉపాధి దొరుకుతుందని భావించి సర్కారు రెండు కంపెనీలకు పనులు అప్పగించింది.
             అయితే ధర్మవరం ప్రజాప్రతినిధి తనకు మామూళ్లు ఇవ్వాల్సిందేనని కంపెనీలను బెదిరించాడు. వారు ఒప్పుకోకపోవడంతో సోలార్ ప్లాంట్ పనులు ఆపేయించాడు. ఇతడి ఆగడాలు భరిచంలేక ఢిల్లీ కంపెనీ తన ప్లాంట్ ఎమ్మిగనూరు తరలించగా.. తాజాగా చెన్నై కంపెనీకి కూడా కష్టాలు మొదలయ్యాయి. కనీసం చెన్నై కంపెనీ ప్లాంట్ అయినా తరలిపోకుండా సర్కారు కళ్లు తెరవాలని స్థానికులు కోరుతున్నారు.

Thursday, December 3, 2015

కర్నూల్లో మట్కా రాకెట్

రాయలసీమ ముఖద్వారమైన కర్నూలులో తెలుగు తమ్ముళ్లు మట్కా మాఫియాకు తెరతీశారు. గతంలో తెరచాటుగా జరిగిన బాగోతాన్ని ఇప్పుడు బహిరంగపరిచారు. ఏకంగా పోలీసులతో కుమ్మక్కై.. వారికి మామూళ్లు ఇస్తూ.. తామూ కొంత సంపాదించుకుంటున్నారు. మట్కాను నిషేధిస్తామన్న సర్కారు మాటలు నీటిమూటలే అవుతున్నాయి.
       కర్నూలు ఆదోని, నంద్యాల, డోన్ ప్రాంతాల్లో మట్కా మాఫియా జోరుగా నడుస్తోంది. గతంలో ఓ న్యాయవాది ద్వారా పోలీసులకు మాామూళ్లు అందేవి. అయితే కొత్తగా బదిలీ అయి వచ్చిన ఓ పోలీస్ అధికారి.. ఈ పద్ధతి మార్చేసి.. తెలుగు తమ్ముళ్ల ద్వారా మామూళ్లు అందేలా చర్యలు తీసుకున్నారు. ఇదే అదనుగా టీడీపీ కార్యకర్తలు తాము కొంత దోచేసి.. మిగలింది పోలీసులకు పంచుతున్నారు.
         మట్కా వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతున్నా ఉన్నతాధికారులు ఎవరూ దాని జోలికి పోరు. ఎందుకంటే టీడీపీ సీనియర్ నేతలంతా ఆ మట్కా మాఫియాలో పాత్రధారులే. తాము తెరవెనుకే ఉంటూ పీఏల ద్వారా చక్రం తిప్పుతున్నారు.

పోర్టు కోసం దేశం నేతల భూదందా

మచిలీపట్నం పోర్టు కోసం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ వివాదాస్పదమౌతోంది. సామాన్యరైతులు పొట్టకొట్టి వేలాది ఎకరాలు సేకరించి, పారిశ్రామికవేత్తలకు కట్టబెడతామనడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా గ్రామాల్లో భూసేకరణపై అభిప్రాయ సేకరణకు ఏర్పాటుచేసిన సమావేశాలు విఫలమయ్యాయి.
      రైతుల్లో వ్యతిరేకతను గ్రహించిన మంత్రులు భూసేకరణ రద్దు చేస్తామని కొన్నిగ్రామాల్లో ప్రకటించారు. అయితే పేరుకే ప్రకటన చేశారు గానీ.. నిజంగా భూసేకరణ రద్దుచేయలేదు. దీంతో ఎప్పటికైనా తమ భూములు లాక్కుంటారని బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు.
       ఈలోగా టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయి భూములు ఇచ్చేది లేదని చెప్పిన రైతులపై భౌతికదాడులకు దిగుతున్నారు. అదేమంటే వ్యక్తిగత గొడవలని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు కూడా తెలుగు తమ్ముళ్లకే వత్తాసు పలుకుతున్నారు.

రేషన్ కార్డులకు పచ్చ గ్రహణం

ఇసుక మాఫియా, మద్యం మాఫియా, రహదారి మాఫియా, ఇలా టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలో పుట్టకొచ్చిన మాఫియాలకు కొత్త మాఫియా జత కలిసింది. ప్రకాశం జిల్లాలో రేషన్ మాఫియా నడుస్తోంది. రేషన్ మాఫియా అంటే.. రేషన్ సరుకులు పక్కదారి పట్టించడం పాత పద్ధతి. ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు కొత్త పద్దతి కనిపెట్టారు. ఈ పద్ధతి ద్వారా దర్జాగా కార్డుదారుల నెత్తిన చేయిపెట్టినా ఎవ్వరూ ఏమీ చేయలని పరిస్థితి కల్పించారు.
            రేషన్ కార్డుల్లో రెండు రకాలుంటాయి. తెలుపు, గులాబీ. అత్యంత వెనుకబడిన వర్గాలు, పేదలకు ఇచ్చే తెలుగు కార్డులను తమకు కావాల్సిన వారికి ఇచ్చేలా టీడీపీ నేతలు పావులు కదిపారు. తహసీల్దార్ కార్యాలయంలో తిష్టవేసి తెల్లకార్డు నంబర్లకు పింక్ కార్డుదారుల ఫోటోలు, వివరాలు చేర్చేచి, కార్డులు ట్యాంపరింగ్ చేస్తున్నారు. దీంతో అసలైన అర్హులకు రేషన్ సరుకులు అందక లబోదిబోమంటున్నారు.
           ఏకంగా తహసీల్దాలర్ యూజర్ ఐడీతోనే ఈ తతంగం అంతా జరుగుతున్నా.. కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. పైగా మీ రేషన్ కార్డుకు ఆధార్ లింక్ అవలేదని, ఆన్ లైన్లో యాక్టివేట్ కావడం లేదని హరికథలు చెబుతున్నారు.

Wednesday, December 2, 2015

గుంటూరులోే దేశం మార్కు బదిలీలు

రాజధాని నేపథ్యంలో గుంటూరు కార్పోరేషన్ కు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. అలాంటి చోట కమిషనర్ గా సమర్థుడైన అధికారులను నియమించాలని సర్కారు భావించింది. అయితే నిజాయితీపరులను ఎక్కువకాలం పనిచేయకుండా.. స్థానిక టీడీపీ నేతలు చక్రం తిప్పుతున్నారు. ఏడాదిలో ఐదుగురు కమిషనర్లు బదిలీ కావడం పచ్చచొక్కాల పాలిటిక్స్ కు అద్దం పడుతోంది.
           గుంటూరు నగరంలో మొదట్నుంచీ రాజకీయాలు ఎక్కువ. అందుకే నగరం ఆశించనివిధంగా అభివృద్ధి చెందలేదనే భావన స్థానికుల్లో ఉంది. ఇప్పుడు పుణ్యమా అని అభివృద్ధి చెందుతుందని భావిస్తుంటే.. స్థానిక ప్రజాప్రతినిధులో అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. నిజాయితీగా పనిచేస్తున్న కన్నబాబు, అనూరాధ వంటి కమిషనర్లను తొమ్మిది నెలల వ్యవధిలో బదిలీ చేయించారు.
    కమిషనర్ అనూరాధ బదిలీ వెనుక టీడీపీ గ్రూప్ పాలిటిక్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఎక్కడ్నుంచో వచ్చి ఇక్కడ గెలిచిన ఓ ఎంపీ కమిషనర్ ను బదిలీ చేయించడానికి సీఎం పేషీలో చక్రం తిప్పారు. మరోవైపు బాగా పనిచేస్తున్న కమిషనర్ ను బదిలీ చేయడంపై ఓ మంత్రితో పాటు కొంతమంది టీడీపీ మాజీ కార్పోరేటర్లు కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఇలా అయితే కార్పోరేషన్ ఎన్నికలకు ఏముఖం పెట్టుకుని వెళతామని ప్రశ్నిస్తున్నారు.