Tuesday, December 1, 2015

కుట్టు కాంట్రాక్టుల కోసం తమ్ముళ్ల కొట్లాట

ఇందుగల డందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అన్నట్లుగా.. చంద్రబాబు జమానాలో ఎక్కడ చూసినా అవినీతి తాండవిస్తోంది. విజయనగరం జిల్లాలో స్కూలుపిల్లలకు యూనిఫాంలు కుట్టించే కాంట్రాక్టు విషయంలో కూడా తమ్ముళ్లు గొడవకు దిగారు. తమ వారికి దక్కాలంటే తమ వారికే దక్కాలని అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. అవినీతిపరులకు సింహస్వప్నాన్నని చెప్పుకుంటున్న సీఎం సింహం ఇప్పుడేం చేస్తోందని స్థానికులు నిలదీస్తున్నారు.
             విజయనగరం జిల్లాలో మొత్తం లక్షా డెబ్భై రెండు వేల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, కేజీవీబీ విద్యార్థులు ఉన్నారు. వీరికి స్కూలు ప్రారంభోత్సవం రోజే రెండు జతల యూనిఫాం ఇవ్వాల్సి ఉంది. అయితే సర్కారు తీరిగ్గా ఇప్పుడు డబ్బులిచ్చింది. దీంతో దాదాపు రెండు కోట్ల రూపాయల కుట్టు కాంట్రాక్టు కోసం టీడీపీ నేతలు రంగంలోకి దిగారు.
            నామ్ కే వాస్తే డీఆర్డీఏకు పన్నెండు మండలాలు అప్పగించి, మిగతా మండలాలను విశాఖలోని కుట్టు ఏజెన్సీలకు అప్పగించారు. అయితే ఈ అప్పగింతలన్నీ ఓ మంత్రి, టీడీపీ నేతల కనుసన్నల్లో జరగడం వివాదాస్పదమైంది. నెల్లిమర మండలం దగ్గరకు వచ్చేసరికి టీడీపీ నేతలకు తేడా వచ్చింది. ఈ మండలం ఏజెన్సీ మార్చాలని మరో మంత్రి పంచాయతీ పెట్టారు. దీంతో వాటాల్లో తేడా వచ్చిందేమోనని స్థానికులు చర్చించుకుంటున్నారు.

No comments:

Post a Comment