Tuesday, December 1, 2015

పదిహేనేళ్లు పోరాడినా ఉద్యోగం అందని ద్రాక్షే

1998లో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ  సర్కారు చేసిన తప్పిదం.. వారి పాలిట శాపంగా మారింది. 98లో డీఎస్సీ క్వాలిఫై అయిన అర్హులైన అభ్యర్థులకు ఇప్పటివరకు ఉద్యోగాలు రాలేదు. వారికి ఉద్యోగాలు ఇవ్వాలని ట్రిబ్యునల్ చెప్పినా, కోర్టులు మొట్టికాయలు వేసినా ఏపీ సర్కారుకు చలనం రాలేదు. మరోవైపు తెలంగాణలో మాత్రం వీరిని స్పెషల్ క్యాటగిరీగా గుర్తించి ఉద్యోగాలివ్వడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు.
        తాను చేసిన తప్పులే దిద్దలేనివాడు.. ఇతరులు చేసిన తప్పులేం దిద్దుతాడన్నది పాత సామెత. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబుకు ఇది కరెక్టుగా వర్తిస్తుంది. 1998 డీఎస్సీలో నిబంధనలకు విరుద్ధంగా కటాఫ్ మార్కులు తగ్గించి అర్హులకు ఉద్యోగాలివ్వని చంద్రబాబు.. ప్రతిపక్ష నేతగా వారిపై కపట ప్రేమ ఒలకబోశారు. తప్పకుండా వారికి ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు.
           అయితే గద్దె నెక్కి పద్దెనిమిదిద నెలలైనా చంద్రబాబు గారికి మాత్రం వీరికి ఉద్యోగాలిచ్చే తీరిక చిక్కడం లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని ఊదరగొడుతున్న బాబు.. ముందు అర్హులైన వారికి ఉద్యోగాలివ్వాలని డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు కోరుతున్నారు. ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చినా సీఎం పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.

No comments:

Post a Comment