Tuesday, December 1, 2015

అంగన్ వాడీ నియామకాల్లో ఇష్టారాజ్యం

అంగన్ వాడీలకు జీతాలు పెంచకుండా సతాయిస్తున్న ఏపీ సర్కారు.. అంగన్ వాడీల నియామకంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. టీడీపీ అదికారంలోకి వచ్చాక తెలుగు తమ్ముళ్లు ఆడింది ఆట పాడింది పాట అయిపోయింది. కడప జిల్లాలో అంగన్ వాడీ వర్కర్లు, ఆయాల నియామకంలో అర్హులకు అన్యాయం జరుగుతోంది. వీరంతా కోర్టుకు వెళితే తమకు ఇబ్బందులు తప్పవని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
        పులివెందుల పరిధిలోని అంకాలమ్మపేట అంగన్ వాడీగా ఇద్దరు మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఒకరు ఆర్టీసీ డ్రైవర్ భార్య కాగా. మరొకరు సామాన్య మహిళ. సామన్య మహిళ బీఏ, బీఈడీ చేశారు. అయితే తెలుగు తమ్ముళ్ల ఒత్తిడితో నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీసీ డ్రైవర్ భార్యకే అంగన్ వాడీ పోస్టు వచ్చింది. రూల్స్ ప్రకారం ఆమెకు తెల్లరేషన్ కార్డు ఉండకూడదు. పైగా గ్రహణం మొర్రి ఉందని ఇంటర్వ్యూలోనే తిరస్కరణక గురైంది.
            కడప జిల్లాలో ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలో మరణించిన సైనికుడి భార్య ఆయా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే టీడీపీ నేతలు అడ్డుతగిలారు. అధికారులు చొరవ తీసుకోవడంతో ఆమెకు ఉద్యోగం వచ్చింది. అయితే ఎంతమంది అదికారులు నేతల్ని ఎదిరించగలుగుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. తెలుగు తమ్ముళ్ల ఆగడాలు శృతిమించుతున్నాయని జనం మండిపడుతున్నారు.

No comments:

Post a Comment