Wednesday, December 2, 2015

తాగునీటికీ సర్కారు కటకట

ఏపీ సర్కారు తీసుకున్న ప్రతి నిర్ణయం వివాదాస్పదంగా మారుతోంది. సంక్షేమ చర్యలు తీసుకోవాల్సిన సర్కారు.. జనం నెత్తిన చెంగేసే పనులు చేస్తూ.. స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా గుదిబండలా తయారతోంది. రక్షిత మంచినీటి పథకానికి నిధులు కూడా పంచాయితీలే భరించాలని చెప్పడం.. ఇప్పుడు కలకలం రేపుతోంది. సాధారణంగా జిల్లా పరిషత్ లు రక్షిత తాగునీటి సరఫరా ఫథకాలకు నిధులిస్తాయని, ఈసారి తమనే కట్టమంటున్నారని సర్పంచ్ లు లబోదిబోమంటున్నారు.
           గ్రామపంచాయితీల బడ్జెట్ సాధారణంగా తక్కువగా ఉంటుంది. గ్రామంలో పన్నులు తక్కువ కాటబట్టి ఆదాయం కూడా చాలా తక్కువ. అక్కడ రోడ్లు, ఆరోగ్యం, పారిశుధ్యం, వీధిదీపాల మరమ్మత్తులు వంటివి ఎలాగో పంచాయితీ నెత్తినే పడతాయి. కనీసం రక్షిత తాగునీటి పథకాలైనా జిల్లా పరిషత్ లు భరించేవని, ఇప్పుడు వాటిని కూడా తమకే అంటగట్టడమేమిటని అనంతపురం జిల్లాలో పలువురు సర్పంచ్ లు సర్కారును నిలదీస్తున్నారు.
        ప్రభుత్వం చెప్పినట్లు తాగునీటి పథకాలకు నిధులిస్తే.. ఇతర అభివృద్ధి పనులు కుంటుపడతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయితీలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా వేధిస్తున్న సర్కారు.. ఇప్పుడు ఆర్థికసంఘం ఇచ్చిన నిధులను కూడా కాజేయాలని చూస్తోందని సర్పంచ్ లు మండిపడుతున్నారు. 

No comments:

Post a Comment